నేడే రాష్ట్రపతి రాక : ఒకే వేదికపై గవర్నర్ - సీఎం కేసీఆర్..!!
రాష్ట్రపతి ముర్ము తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి ముర్ము తొలి సారిగా తెలంగాణకు వస్తుండడంతో గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు స్వాగతం పలకనున్నారు. చాలా కాలం తరువాత గవర్నర్ - సీఎం కేసీఆర్ ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత రాష్ట్రపతి ఏపీలోని శ్రీశైల పర్యటనకు వెళ్తారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న తరువాత ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయిదు రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ లో ఉండనున్నారు.

రాష్ట్రపతి హోదాలో తొలి సారి హైదరాబాద్ కు..
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ముర్ము హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి నిలయం పూర్తిగా ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆధీనంలో ఉండడం గమనార్హం. కాగా రాష్ట్రపతి ముర్మును కలిసేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కు వస్తున్న రాష్ట్రపతి తెలంగాణలో పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. భద్రాద్రి దేవాలయంతో పాటుగా రామప్ప ఆలయానికి వెళ్లనున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన వేళ గవర్నర్ రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ తో పాటుగా న్యాయమూర్తులు..మంత్రులతో సహా ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో మర్యాద పూర్వకంగా రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

శ్రీశైల క్షేత్రానికి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు.మల్లికార్జున స్వామి, భ్రమ రాంబిక ఆలయాలను దర్శిస్తారు. దేవస్థానంలో ప్రసాద్ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలం ట్రాఫిక్‌లో ఆంక్షలు అమలు చేయనున్నారు. లింగాలగట్టు, శిఖరం పాయింట్ల వద్ద ఉదయం 11 గంటలకు వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు వాహనాలను అనుమతిస్తారు. పటిష్ట బందోబస్తుకు చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన హెలీకాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. హెలీప్యాడ్ వద్ద బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

రాష్ట్రపతి షెడ్యూల్ ఇలా …
ఈ నెల 27న కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ విద్యార్థులను, ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమికు చేరుకుని 74వ ఆర్‌ఆర్ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ ట్రైనీస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు మిశ్రుధాతు నిగం నిమిటెడ్‌లోను ప్లెట్ మిల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 28న రాష్ట్రపతి భద్రాచలం లోని సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు సమ్మక్క సారలమ్మ జాంజాటి పూజారీ సమ్మేళనం కార్యక్రంలో పాల్గొంటారు. అదే రోజు ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు శంషాబాద్ సమీపంలోని శ్రీరాంనగరం వద్ద గల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటి విగ్రహాన్ని సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications