వైఎస్ జగన్‌కు ఉన్నవి రెండే మార్గాలు.. !!

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఏర్పడిన సస్పెన్స్ తొలగిపోయింది. మొదట్లో ఈ పదవి కోసం పట్టుబట్టిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ.. ఆ తరువాత రేసు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంది. దీనితో ఈ పదవిని నిలబెట్టుకుంది భారతీయ జనతా పార్టీ.

18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపికను బీజేపీ అగ్రనాయకత్వం కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 17వ లోక్‌సభకు ఓం బిర్లా స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయననే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.

All eyes on YSRCP after INDIA bloc s K Suresh files nomination against Om Birla for the speaker post

వివాదరహితుడు కావడం, స్పీకర్ హోదాలో సమన్యాయాన్ని పాటించారనే సదభిప్రాయం ఓం బిర్లాపై ఉండటమే కారణమని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా-బూందీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఓం బిర్లా. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్‌ను 41 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

అదే సమయంలో అనూహ్యంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా తెరమీదికి వచ్చింది. తమ తరఫున అభ్యర్థిని నిలబెట్టింది. కొడికున్నిల్ సురేష్‌ను లోక్‌సభ స్పీకర్ పదవి కోసం రేసులో నిలిపింది. కొద్దిసేపటి కిందటే కే సురేష్ కూడా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఫలితంగా- స్పీకర్ పదవి కోసం ఎన్నిక తప్పనిసరి అయింది. ఎన్డీఏకు ధీటుగా లోక్‌సభలో తమకు కూడా బలం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ఇండియా. లోక్‌సభ స్పీకర్ కోసం జరిగే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉంటుందని భావిస్తోంది. తటస్థంగా ఉంటూ వచ్చిన పార్టీలు సైతం తమకు మద్దతు ఇస్తాయని ఆశిస్తోంది.

All eyes on YSRCP after INDIA bloc s K Suresh files nomination against Om Birla for the speaker post

ఈ క్రమంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశమౌతోంది. గతంలో బీజేపీకి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. లోక్‌సభలో గానీ రాజ్యసభలో గానీ ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుపైనా స్పందించింది. సీఏఏ వంటి వివాదాస్పద బిల్లులను పక్కనపెడితే దాదాపుగా అన్నింటికీ మద్దతు ఇచ్చింది. ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేసింది వైఎస్ఆర్సీపీ.

ఎన్డీఏలో చేరకపోయినా, బీజేపీతో ఎలాంటి పొత్తూ లేకపోయినా బయటి నుంచి మద్దతు ఇస్తూ వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కూడా ఎన్డీఏ నిలబెట్టిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. ఆమెకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు ఓటు వేశారు.

ఇప్పుడా పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టింది బీజేపీ. టీడీపీని ఎన్డీఏలోకి మళ్లీ చేర్చుకుంది. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక సమయంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్‌సభలో నలుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపొచ్చనేది చర్చనీయాంశమైంది.

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నందున వైఎస్ఆర్సీపీకి ఉన్నివి రెండే మార్గాలు. ఒకటి- కాంగ్రెస్ అభ్యర్థి కొడికున్నిల్ సురేష్‌కు ఓటు వేయడం లేదా తమ ఓటు హక్కును వినియోగించుకపోవడం. అంశాలవారీగా ఎన్డీఏ తమ మద్దతు కొనసాగుతుందని ఇదివరకే వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసినప్పటికీ- రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం కాకపోవడం వల్ల కాంగ్రెస్‌కే ఓటు వేస్తుందని అంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+