AP MPTC-ZPTC Poll counting: పరిషత్ కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు- ఎస్ఈసీ కీలక ఆదేశాలు.!

ఏపీలో నిన్న, ఇవాళ నిర్వహించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు (AP MPTC-ZPTC Poll counting) సర్వం సిద్దమైంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 365 కౌంటింగ్ సెంటర్లలో 9 వేలకు పైగా బల్లలపై ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 11 వేలకు పైగా పర్యవేక్షకులు, 28692 మంది సహాయకుల్ని నియమించారు. అలాగే భద్రత కోసం దాదాపు 20 వేల మంది పోలీసుల్ని రంగంలోకి దించుతున్నారు. ఏకగ్రీవమైన 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు కాకుండా మిగిలిన 577 జడ్పీటీసీ, 7707 ఎంపీటీసీ స్ధానాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత రెగ్యులర్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం లెక్కింపు బల్లల్లో 50 శాతం ఎంపీటీసీలకు, మరో 50 శాతం జడ్పీటీసీలకు కేటాయించారు. ప్రతి బల్లకు ఒక్కో రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ పత్రాలను లెక్కింపు కోసం అందజేస్తారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఈసీ అనిల్ పునేఠా తెలిపారు.

All set For AP MPTC-ZPTC Poll counting tomorrow SEC fields 19885 police cctv drones body cams

బందోబస్తు విధుల్లో 135 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, 572 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,412 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 14,877 మంది అదనపు సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి పోలీసు కానిస్టేబుళ్ల వరకు ఉంటారు. అలాగే 2889 మంది హోమ్ గార్డ్ ల్ని నియమించారు.
కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో వీరితో మూడెంచెల భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. అదేవిధంగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఐజీ బి. రాజకుమారి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+