జగన్ కేబినెట్ 2.0 నేడే ప్రమాణ స్వీకారం - ఆ సీనియర్లు దూరంగా : వైసీపీలో ఉత్కంఠ..!!

సీఎం జగన్ కేబినెట్ 2.0 మరి కాసేపట్లో కొలువు తీరనుంది. సుదీర్ఘ కసరత్తు తరువాత టార్గెట్ -2024 కోసం ఆయన తన కేబినెట్ కూర్పు చేసారు. పాత వారికే 11 మందికి తిరిగి మంత్రి పదవులు ఇచ్చారు. కొత్త వారికి 14 మందికి అవకాశం ఇచ్చారు. వీరందరూ వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.31 గంటలకు తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదిక సిద్ధమైంది.

అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం

అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం

కొత్త కేబినెట్ జాబితాకు గవర్నర్ ఆమోదం...ప్రముఖలకు ఆహ్వానాలు..ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సీటింగ్ సిద్దం చేసారు. పాస్ లు జారీ అయ్యాయి. సిద్ధమైంది. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతారు. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్‌లు చేసి సమాచారం ఇచ్చారు. 'ముఖ్యమంత్రి మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.. సోమవారం ప్రమాణ స్వీకారం చేయడానికి విచ్చేయాలి' అని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అయిన తరువాత గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది. 10 మంది బీసీ వర్గానికి చెందిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

రోజా ప్రత్యేకార్షణగా.. 25 మంది ప్రమాణం

రోజా ప్రత్యేకార్షణగా.. 25 మంది ప్రమాణం


నేటి ప్రమాణ స్వీకారం చేసే వారిలో రోజా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతున్నారు. ఇక, మాజీ మంత్రులు సైతం నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని సీఎం కేబినెట్ సమావేశం సూచించారు. కానీ, కొందరు మాజీ మంత్రులు..సీనియర్లు సైతం ఈ కర్యక్రమానికి దూరంగా ఉండాలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు సుచరిత..బాలినేని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. కోటంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సామినేని ఉదయభాను...సుచరిత.. పార్ధసారధి..శిల్పా మోహన్ రెడ్డి అనుచరలు నిరసనలకు దిగారు. దీంతో..పాటుగా తమకు మంత్రి పదవి ఖాయమనే చివరి ఆశలతో ఉన్న సీనియర్లు సైతం ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ ప్రమాణ స్వీకారం తరువాత మంత్రుల శాఖలు ప్రకటించనున్నారు.

శాఖల కేటాయింపు ఖరారు..

శాఖల కేటాయింపు ఖరారు..


ఇప్పటికే కొందరి శాఖల పైన స్పష్టత వచ్చింది. గతంలో మాదిరిగానే అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. అందులో అంజాద్ బాషా.. రాజన్నదొర కు ఇప్పటికే ఖరారు చేసారు. ఎస్సీ వర్గం నుంచి వనితకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాద రావు పేరు ముందు వరుసలో ఉంది. కాపు వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాల్లో ఒకరికి దక్కనుంది. శాఖల కేటాయింపులోనూ ఇప్పటికే జగన్ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కీలకమైన వ్యవసాయ శాఖను నెల్లూరు నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఖాయమైనట్లు సమాచారం.

సీనియర్లకు కొనసాగుతున్న బుజ్జగింపులు

సీనియర్లకు కొనసాగుతున్న బుజ్జగింపులు


అయితే, ఇక..ఈ రోజు ప్రమాణ స్వీకారం.. ఇదే సమయంలో పదవులు రాని వారి క్యాంపుల్లో కొనసాగుతున్న నిరసనలతో వైసీపీలో ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు బుజ్జగింపులు లేవని చెబుతూనే..బాలినేని లాంటి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పిన్నెళ్లి సీఎంఓ నుంచి ఫోన్ చేసినా స్పందించ లేదు. బాలినేనికి మద్దతుగా ప్రకాశం ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దీంతో..ఈ రోజు జరిగే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+