ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నేడే..!! ఏ సర్వీసుపై ఎంత మేర - వైసీపీ హాయంలో రెండో సారి..!!
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమైంది. ఆర్జీసీ యాజమాన్యం పెరిగిన ధరలను ఈ రోజు అధికారికంగా ప్రకటించనుంది. పెరిగిన డీజీల్ ధరలు..నిర్వహణా భారంతో ఛార్జీలు పెంచక తప్పదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రాయితీలు భరించే అవకాశం లేకపోవటంతో..ఛార్జీల పెంపు తప్పదని నిర్ణయించారు. కరోనా సమయంలోనే ఆర్టీసీ భారీగా నష్టాలను ఎదుర్కొంది. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న అప్పులు..వడ్డీల చెల్లింపు..నిర్వహణ ఖర్చులతో పాటుగా నష్టాల అంశం పైన అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు.
దీంతో..పల్లెవెలుగు బస్సు నుంచి ఏసీ బస్సు వరకు అన్నింటి పైనా ఛార్జీల భారం వేయక తప్పదని నిర్ణయించారు. అన్ని సర్వీసుల పైన దాదాపు 20 -25 శాతం మేర పెంపుకు అధికారులు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. పెరిగిన ఛార్జీలను వెంటనే అమలు చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆర్టీసీ ఛైర్మన్..ఎండీ పెరిగిన ఛార్జీల వివరాలను ప్రకటించనున్నారు. 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ ఛార్జీల పెంపు ఇది రెండో సారి. 2019 డిసెంబర్ లో అన్ని రకాల సర్వీసుల పైన ఛార్జీలు పెంచారు. అప్పట్లోనూ డీజీల్ ఛార్జీలతో పాటుగా కొన్ని సర్వీసుల కారణంగా ఏర్పడుతున్న నష్టాలు..రుణ భారం..కడుతున్న వడ్డీలతో పాటుగా మోటారు వాహన పన్ను వంటి వాటి కారణంగా ఛార్జీలు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.

పల్లె వెలుగు సర్వీసుల్లో కనీస ఛార్జ్ రూ 5 ఉండగా..దానిని రెట్టింపు చేయాలని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే పల్లె వెలుగ పైన భారం తగ్గించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..దీని పైన కొంత మేర భారం పడే అవకాశం ఉంది. అదే విధంగా.. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెరగనుంది. సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ కనీస ధర రూ.45. ఇది... రూ.60కి చేరే అవకాశముంది. ఏసీ బస్సులో కనీస టికెట్ ధర రూ.వంద రూపాయాల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పెరిగిన ధరల పైన ఆర్జీసీ యాజమాన్యం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయనుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications