వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచే భారత్‌ జోడో యాత్ర : ఏపీ- తెలంగాణ నుంచి పాల్గొనేది వీరే..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేటి నుంచి భారత్ జోడో యాత్రం ప్రారంభిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి దాదాపు ఆరు నెలల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ సందర్శించారు. ప్రత్యేక నివాళులు అర్పించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ ను పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యంగా..బీజేపీకి తమ శక్తి చాటుకొనే ఉద్దేశంతో రాహుల్ ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు.

రాహుల్ యాత్రకు సర్వం సిద్దం

రాహుల్ యాత్రకు సర్వం సిద్దం

ఇప్పటికే రాహుల్ రూట్ మ్యాప్.. యాత్రలో పాల్గొనే నేతలు..వారికి బాధ్యతల అప్పగింత పూర్తయింది. రాహుల్ కాసేపట్లో తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాలు, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ స్మారకాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కి అందించి యాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు.

ఆహారం- నిద్ర అన్నీ రోడ్డు పక్కనే

ఆహారం- నిద్ర అన్నీ రోడ్డు పక్కనే


భారత్‌ జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. పాదయాత్ర రేపు (గురువారం) ఉదయం నుంచి ప్రారంభం కానుంది. రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి. తమిళనాడులో 2,500 మంది పోలీసుల్ని ఈ విధుల్లో నియమించారు. యాత్ర తొలి 4 రోజులు తమిళనాడులో కొనసాగనుంది. 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీ తన పాదయాత్ర సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రాథమిక వసతులతో కంటైనర్లను ఏర్పాటు చేసారు. ఈ యాత్రలో రాహుల్ లో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి వీరే

తెలుగు రాష్ట్రాల నుంచి వీరే

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి ఆరుగురు వచ్చారు. కేతూరి వెంకటేష్‌, సంతోష్‌.కె, వెంకటరెడ్డి, కత్తి కార్తీకగౌడ్‌, బెల్లయ్యనాయక్‌ తెలావ్‌, అనులేఖ బూస వీరిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు. రాహుల్ దాదాపు 12 రాష్ట్రాలు .. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాత్ర కొనసాగించనున్నారు. రాహుల్ వెళ్లని రాష్ట్రాల్లో ఈ యాత్రకు అనుబంధంగా 'అతిథి యాత్రీస్‌' పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. పలు రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం తర్వాత యాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

English summary
All set for launch Bharat Jodo Yatra,national-level foot march from Kanyakumari. The Yatra will be officially launched today by Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X