నో కాంప్రమైజ్, చంద్రబాబు ఆదేశాలు - ఆపరేషన్ షురూ..!!
వరదలతో నష్టపోయిన విజయవాడ క్రమేణా కోలుకుంటోంది. ప్రభుత్వం ఆర్దిక సాయం ప్రకటించేందుకు తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో బుడమేరు పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలిగించటం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ బుడమేరు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ప్రభుత్వం కసరత్తు
విజయవాడ వరదలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆపరేషన్ బుడమేరు మొదలైంది. ఇప్పటికే ముసాయిదాను అధికారులు సిద్దం చేసారు. పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలతో పాటుగా ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యల పైన ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ప్రధానంగా బుడమేరు పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలిగించటం పైన ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరిస్తోంది. ఆక్రమణల తొలిగింపు వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలని..న్యాయ పరంగా వచ్చే సమస్యల పైన చర్చలు చేస్తోంది.

ఆక్రమణల తొలిగింపు
వాటిని ఆక్రమించినవారినీ, తెలియక ఆ ప్రాంతంలో స్థలాలు కొన్నవారిని పిలిపించి మాట్లాడి సామరస్యంగా ఈ సమస్యకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక.. పటిష్ఠ చర్యల్లో భాగంగా ఈ వాగు ప్రవాహం సాఫీగా సాగేందుకు ఎక్కడికక్కడ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. బుడమేరు గండ్ల పటిష్ఠతకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. క్రమణలను తొలగించడంతోపాటు ఈ వాగు గట్లను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం. దీర్ఘకాలిక చర్యల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు.. జలవనరుల శాఖతో ఇప్పటికే చర్చించారు. పలు నిర్ణయాలు జరిగాయి.
రిటైనింగ్ వాల్ నిర్మాణం
బుడమేరుకు వచ్చే వరద నీరు 15 వేల క్యూసెక్కులుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అసాధారణ రీతిలో భారీ వర్షాలు పడటంతో ఈసారి మాత్రమే బుడమేరకు రికార్డుస్థాయిలో 45 వేల క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బుడమేరుకు దాదాపు 37వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా విస్తరణ పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం డీపీఆర్ రూపొందించాలని నిర్దేశించారు. బుడమేరులో బలహీనంగా ఉన్న గట్లను ముందుగా గుర్తించాలన్నారు. వాగుకు గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్‌ను నిర్మించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications