14న నోటిఫికేషన్: నవంబర్ 8న ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అక్టోబర్ 14 నోటిఫికేషన్ జారీ కానుంది. అక్టోబర్ 14న నోటిఫికేషన్, నవంబర్ 8న ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక నిర్వహించనున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది.అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని, 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పుడు జరిగిన ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఆళ్లగడ్డకు జరనున్న ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications