అల్లు అర్జున్ అరెస్ట్.. చంద్రబాబును లాగుతూ కేఏ పాల్ సంచలనం

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వెంటనే అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం తనకు వచ్చిన హక్కుతో కోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారని అల్లు అర్జన్‌ను అరెస్టు చేశారు సరే.. ప్రస్తుతం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీలు నిర్వహించినప్పుడు ఎంతో మంది చనిపోయారని.. అప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.

Allu Arjun should be released immediately KA Paul

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తే 8 మంది చనిపోయారని కేఏ పాల్ తెలిపారు. గుంటూరులో ముగ్గురు చనిపోయారని.. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు స్టంట్ చేసినప్పుడు తొక్కిసలాట జరిగి 23 ంది చనిపోయారని కేఏ పాల్ గుర్తు చేశారు.

అయితే, అప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? ఆయన్ను స్టేషన్‌కు తీసుకొచ్చారా? ఆయన్ను విచారించారా? అని కేఏ పాల్ నిలదీశారు. పవర్ పొలిటికల్ లీడర్ల విషయంలో ఒకలా.. సాధారణ ప్రజలు, నటుల విషయంలో మరోలా వ్యవహరిస్తారా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+