కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీని వీడిన కీలక నేతలు అధికార వైసీపీలో చేరుతున్నారు. రోజుకో నేత జనసేనను వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. జనసేన పార్టీలో అసమ్మతి కాస్తా ఎక్కువగా కనిపిస్తోంది.

జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

Amalapuram Janasena leader DMR Shekhar quit from party

అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు, మామ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ ,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ పోతిన మహేష్, పాముల రాజేశ్వరి ,నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ మనుక్రాంత్ ,నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ వంటి నేతలు జనసేనకు రాజీనామా చేయగా, తాజగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సాయంత్రం అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. అమలాపురం పార్లమెంట్ టికెట్ ఆశించిన ఆయన.. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన శేఖర్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి అమలాపురం పార్లమెంట్ లేదా? అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు. చివరకు నిరాశే ఎదురవడంతో పార్టీకి గుబ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఒకటి, రెండో రోజుల్లో ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+