జనసేనతోనే కాపు వర్గం, కానీ నష్టమే - ఆమంచి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ అలర్ట్ అయింది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇప్పటికే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారుతోంది. వైసీపీ ముఖ్య నేత ఆమంచి కాపు వర్గం మద్దతు..టీడీపీ - జనసేన పొత్తు కారణంగా ఏం జరుగుతుందనే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణ మోహన్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. జనసేన తో ఖచ్చితంగా కాపు సామాజికవర్గం ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు కారణంగా జనసేనకు ఉపయోగం లేదని విశ్లేషించారు.పవన్ టీడీపీకి రాత్రి కీ రాత్రే మద్దతు తెలపడం కార్యకర్తలు అభిమానులు కు ఇబ్బంది కలిగించిందని చెప్పారు. మోడీ తనను అర్థం చేసుకున్నారని పవన్ చెప్పడం ఆయన అభిమానులు కార్యకర్తల్లో ఉన్న నిస్పృహను అర్ధం చేసుకోవచ్చని వివరించారు. పొత్తు ధర్మం పాటించకుండా పొత్తులు కుదుర్చుకున్నారని చెప్పుకొచ్చారు. సామాన్య కాపులు పవన్ అభిమానులు పొత్తును వ్యతిరేకిస్తున్నారని ఆమంచి పేర్కొన్నారు.

Amanchi Krishna Mohan Crucial comments kapu community support for Janasena in next Elections

టీడీపీ బలోపేతం కోసం నసేన ఎందుకని ప్రశ్నించారు. పవన్ పెట్టిన పార్టీకి జస్టిఫికెషన్ ఉండాలి కదా అని నిలదీసారు. జనసేన టీడీపీ పొత్తు పై త్వరలో రిన్ని వివరాలు చెబుతానని ఆసక్తి పెంచారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో బంధుత్వం పురందేశ్వరిని ఇబ్బంది పెట్టవచ్చని పేర్కొన్నారు. కానీ, పార్టీకి బంధుత్వానికి ముడి పెట్టద్దని సూచించారు.

గతంలో దగ్గుబాటి వైసీపీలో చేరానని..దీని ద్వారా టీడీపీని వ్యతిరేకించినట్లేనని విశ్లేషించారు. పురందేశ్వరి మాట్లాడుతున్న తీరు..చేస్తున్న ఆరోపణలు సరి కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో పురందేశ్వరి ఆలోచించుకోవాలని సూచించారు. పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఆమంచి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్దిగా గెలిచేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+