అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ సాగుతోంది. ఆమంచి వైసీపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

చంద్రబాబును కలవలేదు
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. మంత్రి శిద్ధాను ఆయన వద్దకు పంపించారు. కానీ ఆమంచి తగ్గలేదు. తనకు టీడీపీలో అన్యాయం జరుగుతోందని చెప్పారు. తనను కలవాలని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం టీడీపీ అధినేతను కలుస్తారని భావించారు. కానీ ఆయన కలవలేదు.

రామచంద్రాపురంలో ఆమంచి ప్రత్యక్షం
అదే సమయంలో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమంచి రాత్రి వరకు చంద్రబాబు వద్దకు చేరుకోలేదు. చంద్రబాబు కడప, కర్నూలు జిల్లా నేతలతో బిజీగా ఉండటం వల్లే కలవలేదని తెలుస్తోంది. నేడు లేదా రేపు చంద్రబాబును కలవవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఆమంచి రామచంద్రాపురంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రామచంద్రాపురంలో పార్టీకి చెందిన తోట త్రిమూర్తులును కలిశారు. అయితే తోట కూడా తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఆమంచి, తోట జనసేనవైపా, వైసీపీ వైపా
ఈ నేపథ్యంలో తోట, ఆమంచిలు కలుసుకోవడం గమనార్హం. అంతేకాదు, వారు రామచంద్రాపురంలో పలువురు కాపు నేతలతోను భేటీ అయ్యారని తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు పైన చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. తోట, ఆమంచి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారు ఇద్దరు కలిసి వైసీపీలో చేరుతారా లేక తమ తమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందనే అభిప్రాయంతో వారు జనసేన వైపు చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications