అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో సీజేఐ ఎన్వీ రమణ - రైతుల పూల వర్షం : తానేమీ హీరోను కాదంటూ ఛలోక్తులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అమరావతిలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం లభించింది. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా అమరావతికి వచ్చారు. మూడు రోజుల ఏపీ పర్యటన లో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ నాగార్జున యూనవర్సిటీలో జరిగిన ఏపీ న్యాయాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన అమరావతి బయల్దేరారు. నేలపాడులోని హైకోర్టులో బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ కు సన్మానం జరిగింది.

అమరావతి గ్రామాల్లో పూలవర్షం

అమరావతి గ్రామాల్లో పూలవర్షం

నాగార్జున యూనివర్సిటీ నుంచి హైకోర్టుకు వెళ్లే మధ్యలో అమరావతి గ్రామాల్లో సీజేఐకు అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. జాతీయ జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. సీజేఐ కు నమస్కరిస్తూ.. పూలు జల్లుతూ.. రైతు కండువాలు ధరించి సీజేఐకు స్వాగతం పలికారు. వారి ఆహ్వానానికి..అభిమానానికి ప్రతిగా సీజేణ తన కారులోనే నిలబడి వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. గతంలో 2015లో అమరావతి నగర శంకుస్థాపన సమయంలో ప్రధానితో పాటుగా జస్టిస్ ఎన్వీ రమణ సైతం పాల్గొన్నారు.

హైకోర్టులో ఘన స్వాగతం

హైకోర్టులో ఘన స్వాగతం


ఆ తరువాత హైకోర్టు భవనం ప్రాంభోవత్సం సమయంలోనూ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి సారి ఆయన అమరావతికి రావటంతో రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక, హైకోర్టులో సీజేఐ కు హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన సన్మానం చేసారు. హైకోర్టు న్యాయమూర్తులు..అధికారులు..సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ ఛలోక్తులు విసిరారు. తనతో ఫొటోలు దిగటానికి..శాలువాలు కప్పటానికి తొందర పడవద్దని సూచించారు.

హీరోను కాదంటూ ఛలోక్తులు

హీరోను కాదంటూ ఛలోక్తులు


మూడు రోజుల పర్యటనలో కార్యక్రమాలకు హాజరై.. లనేక ప్రసంగాలు చేసానని చెప్పారు. ఇక తాను ఉండలేనంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైదరాబాద్ వెళ్లిపోయారని..ఇక, మిగిలిన వారు కూడా వెళ్లకముందే కార్యక్రమం ముగిద్దామని సూచించారు. తాను సినిమా హీరోను కాదని..మీ వాడిని..అందరికీ తెలిసిన వాడినేని చెప్పారు. ఇక, ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని..తాను ఏపీ సీజే కు పేర్లు పంపాలంటూ లేఖలు రాసానని వెల్లడించారు. త్వరలోనే ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మరి కాపేసట్లో సీజేఐ రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు హాజరు కానున్నారు.

English summary
CJI NV Ramana reaches high court where the farmers gave him a grand welcome.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X