మళ్లీ ఏపీ హైకోర్టుకు అమరావతి రైతుల న్యాయమూర్తి..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను నిరసిస్తూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. అమరావతిలోని పలు గ్రామాల్లో ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేసుకుని నిరసనలు తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణగదొక్కేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించేవారు. దీంతో రైతులు చివరి ఆప్షన్ గా న్యాయస్థానాల్ని ఆశ్రయించేవారు.
అలాంటి సమయంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్ .. రైతుల నుంచి వచ్చిన పలు పిటిషన్లను డీల్ చేశారు. అంతే కాదు న్యాయాన్ని నిలబెట్టేందుకు తనదైన శైలిలో కీలక తీర్పులు వెలువరించారు. ఈ తీర్పులు రైతులకు ఎంతో ఊరటగా నిలిచాయి. దీంతో రైతులు ప్రభుత్వం కంటే న్యాయస్థానాలపై నమ్మకం పెంచుకున్నారు. అప్పట్లో జస్టిస్ బట్టు దేవానంద్ వెలువరించిన పలు తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి షాకులిచ్చాయి. అదే సమయంలో అమరావతి రైతులకు ఎంతో ఊరటగా నిలిచాయి.

దీంతో అమరావతి రైతులు జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనంపై ఎంతో నమ్మకం పెట్టుకునే వారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంలో ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించిన జస్టిస్ బట్టు దేవానంద్ ను ఏపీ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అవేవీ లెక్కచేయకుండా బట్టు దేవానంద్ పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. చివరికి ఆయన్ను మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. దీంతో ఆయన కిమ్మనకుండా అక్కడికి వెళ్లేందుకు సిద్దమయ్యారు.

అప్పటివరకూ తాము దాఖలు చేసుకున్న ఎన్నో పిటిషన్ల విషయంలో కీలక తీర్పులు ఇచ్చి ఊరటనిచ్చిన జస్టిస్ బట్టు దేవానంద్ పై అమరావతి రైతులు తమ మక్కువ చాటుకున్నారు. ఆయనకు సన్మానం చేసి పంపారు. దేవానంద్ తరహాలోనే అప్పటి సీజే, ఇతర జడ్డీలకు కూడా రైతులు మొక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. చివరికి అమరావతి రైతులు గత ఎన్నికలకు ముందు చేపట్టిన న్యాయస్దానం టూ దేవస్థానం పాదయాత్రలకు సైతం న్యాయమూర్తుల తీర్పులే స్ఫూర్తినిచ్చాయి.












Click it and Unblock the Notifications