Amaravati: రాజధాని రైతులకు ప్రభుత్వం అరుదైన ఆతిథ్యం..!!

అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతిలో రెండో విడత లాండ్ పూలింగ్ కొనసాగుతోంది. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మొదలు పెట్టింది. ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఇదే సమయంలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడకల్లో రైతులకు ప్రత్యేక ఆతిథ్యం కల్పిస్తూ.. అరుదైన గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ.. భూములు ఇచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2015 నుంచి రాజధాని నిర్మాణానికై భూములు అందజేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన 195 మంది రైతులకు సీఆర్డీఏ అధికారులు 381 నివాస, వాణిజ్య ప్లాట్లను అధికారులు అందించారు. ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైయల్​ రన్​ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు.

amaravati-farmers-got-special-invitation-form-ap-govt-first-republic-day-celebrations-in-capital

రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందజేశారు. మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ ల కేటాయింపు చేయనున్నారు. ప్లాట్​లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేసారు. ఇక.. అమరావతి వేదికగా తొలి సారి రిపబ్లిక్ డే వేడుల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భారీ ఏర్పాట్లు

అమరావతిలో నిర్మిస్తోన్న గవర్నమెంట్ కాంప్లెక్స్​లోని బ్లాక్-D వేదికగా గణతంత్ర దినోత్సవం జరగనుంది. 20 ఎకరాల పైగా విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్​ను శరవేగంగా నిర్మిస్తున్నారు. ఆకర్షణీ యంగా తీర్చి దిద్దుతున్నారు. అతిథులకు ఎక్కడా చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. విశాల ప్రాంతంలో ప్రధాన వేదిక, పరేడ్ ట్రాక్ అండ్ గ్యాలరీ ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కోసం మరో స్పెషల్ గ్యాలరీని సిద్ధం చేస్తున్నారు.

ఈ రిపబ్లిక్ డే వేడుకల కోసం హాజరు అయ్యేలా అమ‌రావ‌తి రైతుల‌కు ఆహ్వానాలు అందాయి. అక్కడ వారి కోసం ప్ర‌త్యేకంగా వీఐపీ గ్యాల‌రీ ఏర్పాటు చేసారు. వేడుకలను స్వయంగా తిలకించేందుకు మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లను సీఆర్డీఏ అధికారులు చేస్తున్నారు. తొలి సారి అమరావతి వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో రైతులకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+