రైతులకు 72 వేల కోట్లు చెల్లించాలి: అమరావతి లో ఉల్లంఘిస్తే: ప్రభుత్వ..రైతుల మధ్య నాటి ఒప్పందం..!

అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు..మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కమిటీ ద్వారా..మూడు రాజధానుల వ్యవహారానికి మార్గం సుగమం చేసు కుంటుంటే..ఇటు అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా న్యాయ పరంగా తమకు అనుకూలగా ఉన్న అంశాల మీద వారు చర్చలు చేస్తున్నారు.

తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సైతం అమరావతి నుండి రాజధాని తరలిస్తే ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ముగినిపోతుందని..భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు అమరావతి స్థానికులు తాము రాజధాని కి భూములు ఇచ్చే సమయంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావిస్తున్నారు. దీని మేరకు తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుందని...అదే ఉల్లంఘిస్తే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందంటూ గతంలో జరిగిన ఒప్పందాలను తెర మీదకు తెస్తున్నారు.

నాటి ఒప్పందం మేరకు

నాటి ఒప్పందం మేరకు

నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం స్థానిక రైతుల నుండి భూముల సమీకరించింది. ఆ సమయంలో ప్రభుత్వం..రైతుల మధ్య జరిగిన ఒప్పందాలను ఇప్పుడు రైతులు వెలుగు లోకి తెస్తున్నారు. అందులో భాగంగా.. రైతులు 9.14 ఫారం లో ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న షరతులు స్థానికులకు వివరిస్తున్నారు. అందులో పేర్కొన్న విధంగా.. పార్టీ-1: భూ యజమానులుగా.. పార్టీ-2: ప్రభుత్వం గా ఆ ఒప్పంద జరిగిందని చెబుతున్నారు.

ఆ సమయంలో 9.14 ఫారం లో మనతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో 18వ షరతు ప్రకారం..ఏ షరతు అయిన ప్రభుత్వం ఉల్లంగిస్తే.. ప్రస్తుత చట్టము 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని రైతులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ అంశాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ప్రభుత్వం నుండి 72 వేల కోట్లు చెల్లించాలంటూ

ప్రభుత్వం నుండి 72 వేల కోట్లు చెల్లించాలంటూ

రైతులు ప్రస్తావిస్తున్న ఒప్పందంలోని 18వ షరతు ప్రకారం అమరావతిలో పనులు నిలుపుదల చేయమని పార్టీ 1 కోరకూడదని..అదే విధంగా ఒప్పందంలోని ఏ షరతు అయినా పార్టీ-2 ఉల్లంఘిస్తే నష్టపరిహారం తో పాటుగా చట్టం కింద అర్హమైన పరిహారము పొందటానికి అర్హులై ఉంటారంటూ స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు.

ఈ లెక్క ప్రకారం అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ వాల్యూ గజానికి ధర రూ 5000 గా ఉంది. దీని కింద రైతులకు ప్రభుత్వ ఇవ్వాల్సిన భూమి 1450 గజాలకి రైతుల లెక్క ప్రకారం 72,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుత భూ సేకరణ చట్టం ప్రకారం మూడురెట్లు పరిహారం అంటే 2కోట్ల 17 లక్షలు ప్రతి ఎకరానికి చెల్లించాలని రైతులు లెక్కలు చెబుతున్నారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాలకు దాదాపు 72 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నది రైతులు..వారికి మద్దతుగా నిలుస్తున్న నేతల వాదన.

ప్రభుత్వం ఏం చేస్తోంది..

ప్రభుత్వం ఏం చేస్తోంది..

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఇదే సమయంలో ఒక వైపు పోరాటం చేస్తూనే..రైతులు న్యాయ పరమైన అంశాల మీద నిపుణులతో చర్చలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సైతం ప్రభుత్వం అమరావతి నుండి రాజధాని తరలిస్తే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అదే విధంగా టీడీపీ నేతలు సైతం రైతులకు గత ప్రభుత్వం లో చేసిన సీఆర్డీఏ చట్టం న్యాయ పరంగా అండగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

దీంతో..రైతులు ఆ దిశగా ఆలోచనలు ప్రారంభించారు. ఇక, ఇప్పుడు తాము భూ సమీకరణ కింద ఇచ్చిన భూములను వేల కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి..ఇవన్నీ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తుందా అంటే..ప్రభుత్వంలోని ముఖ్యులు మాత్రం అన్ని అంశాలను అధ్య యనం చేసిన తరువాతనే ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. దీంతో..ఇది రానున్న రోజుల్లో న్యాయ పరమైన వివాదంగానూ మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+