'అమరావతి'కి వాతావరణ ఇబ్బంది!: ప్రధాని మోడీ ఏమిస్తారో?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. గురువారం నాడే శంకస్థాపన నేపథ్యంలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, అధికారులు వాతావరణ పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పెడతాయా అని ఆందోళన చెందుతున్నారు.
ఆదివారం నాడు ఏర్పాట్లు చేస్తుండగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, పలువురు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఎక్కువ వేడి కూడా ఇబ్బంది పెట్టే అంశమే. గత కొద్ది రోజులుగా పరిసరాల్లో టెంపరేచర్ ఎక్కువగానే ఉంది.
ఇలాంటి వాతావరణమే మరో రెండు మూడు రోజులు ఉండవచ్చునని భావిస్తున్నారు. విజయవాడ పరిసరాల్లో ఇలాగే ఉండవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపనకు ముందు లేదా ఆ తర్వాత వర్షం పడినా లేక వేడి ఎక్కువ ఉన్నా ఇబ్బందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు.

మోడీ ఏమిస్తారో?
అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో... ఆయన ఏపీకి ఏం ప్యాకేజీ ఇస్తారో అనే చర్చ సాగుతోంది.
బీహార్‌కు 1.25 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. విభజన నేపథ్యంలో నష్టపోయిన ఏపీకి ప్రధాని మోడీ ఏమిస్తారనే చర్చ అందరిలోను సాగుతోంది. ప్రధాని మోడీ ఏపీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, ఆయన ఏం ప్రకటిస్తారనే ముఖ్యమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications