ఏపీకి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వాస్తవానికి ఈనెల రెండోతేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే విజయనగరంలోకి ప్రవేశించిన తర్వాత స్తబ్దుగా ఉండిపోవడంతో వర్షాలు కురవలేదు. వారం రోజుల అనంతరం మళ్లీ రుతుపవనాలు చేరుగ్గా కదలడంతో వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. రాబోయే ఐదురోజులు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. అనకాపల్లి జిల్లా, , పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి జల్లులు పడతాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలు వీసే అవకాశం ఉందని వెల్లడించింది.

amaravati meteorological department warning to ap people

పాతపట్నంలో అత్యధికంగా
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 68.8, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 61.7, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 61.4, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 114.8 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 87.2పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 59.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలీలో 58.4, విజయనగరం జిల్లా వేపాడలో 51.8, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 41.2, ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 51.6, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 47.6, విశాఖపట్నం భీమిలిలో 42.4, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 41.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+