అమరావతి ఓఆర్‌ఆర్ రూ.25వేల కోట్లు...హైదరాబాద్ కంటే భారీగా, గేమ్ ఛేంజర్..!!
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. రాజధాని చుట్టూ 190 కిలో మీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌హెచ్‌ఏఐ, డీపీఆర్‌ను సిద్ధం చేసి ఆమోదం కోసం ఢిల్లీకి పంపింది. ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. ఈ ప్రతిపాదన హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పెద్దదిగా అధికారులు చెబుతున్నారు.
అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం పైన తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయాన్ని రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పొడవు 158 కిలోమీటర్లు కాగా, అమరావతి ఓఆర్‌ఆర్ 190 కిలోమీటర్లతో దానికంటే పెద్దది కానుంది. ఇది రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలకంగా మారనుంది. ఈ నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. ప్రతి ప్యాకేజీని వేర్వేరు దశల్లో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ రింగ్‌రోడ్ మొత్తం ఆరు వరుసల ప్రధాన మార్గంతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కలిపి నిర్మించనున్నారు. ప్రతి వైపు రెండు వరుసల సర్వీస్ రోడ్లు ఉండటం మొత్తం పది వరుసల రహదారి నిర్మాణం అవుతుంది. ఓఆర్‌ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టనున్నారు.

కాగా, 190 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ జరుగుతోంది. ఈ భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు భరిస్తుందని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై రెండు ఆరు వరుసల వంతెనలు నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ మార్గం గంగినేనిపాలెం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుంది. అక్కడి కొండ ప్రాంతం కారణంగా రెండు టన్నెల్స్ నిర్మించాలని నిర్ణయించారు. అమరావతి ప్రాంతాన్ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం కోసం రెండు స్పర్ రోడ్లు నిర్మించనున్నారు. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో రాజధాని పరిసర ప్రాంతాలకు ఉత్తమ రహదారి కనెక్టివిటీ లభించనుంది. ఈ నిర్మాణం పూర్తి చేస్తే రాజధానికి కొత్త రూపు రేఖలు రానున్నాయి.












Click it and Unblock the Notifications