• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి లో గందరగోళ రాజకీయం..! పవన్ తో టీడిపి అంతర్గత ఒప్పందం పై గుసగుసలు నిజమేనా..!!

|

అమరావతి : ఆ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయి...కాదు...కాదు ఈ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయి అంటూ పలు సర్వేలు చెబుతుండటం చూసి ప్రజలు గందరగోళం పడుతున్నారు. ఏ పార్టీ గెలుస్తుందో నని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ కనిపిస్తున్నా ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వేలు స్పష్టత ఇవ్వడంలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

<strong>ష్.. గప్ చుప్..! నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ఆగిపోనున్న నేతల ప్రచారం..!!</strong>ష్.. గప్ చుప్..! నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ఆగిపోనున్న నేతల ప్రచారం..!!

గజిబిజి గా సర్వేలు..! ఎపిలో అర్థం కాని రాజకీయాలు..!!

గజిబిజి గా సర్వేలు..! ఎపిలో అర్థం కాని రాజకీయాలు..!!

మీడియా సంస్థలు సైతం పార్టీలకు వత్తాసు పలుకుతుండటంతో సరైన సమాచారం ప్రజలకు అందడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీ పత్రిక ఆ పార్టీకి వత్తాసు పలుకుతోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని చేరవేసే పత్రికలు పార్టీలతో కలవడంతో ఎలాంటి పరిణామాలు ముందు ముందు చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏ సంస్థ తెలిపిన సర్వేను ప్రజలు నమ్మే పరిస్థితులు నేడు కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ప్రజలు వేచిచూడాల్సిందనే భావన కలుగుతోంది.

 అదికార పార్టీతో అనదికార ఒప్పందం..! తారా స్థాయిలో వినిపిస్తున్న గుసగుసలు..!!

అదికార పార్టీతో అనదికార ఒప్పందం..! తారా స్థాయిలో వినిపిస్తున్న గుసగుసలు..!!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య ఒప్పందం మరోసారి బట్టబయలైంది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన మధ్య ఓ అనదికార ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో పర్యటనకు పవన్ దూరంగా ఉన్నాడు. అంతేకాదు చంద్రబాబు కూడా జనసేనాని నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉండడం గమనార్హం.

 పవన్ పాచిక ఏంటి..! అర్థం కాని వ్యూహం..!!

పవన్ పాచిక ఏంటి..! అర్థం కాని వ్యూహం..!!

అదేవిధంగా పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలో కూడా చంద్రబాబు తన ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నాడు. ఈ నియోజక వర్గాల్లో ప్రచారానికి రావాల్సిందిగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు బాబు కోరిన వెళ్లకుండా మౌనం వహించాడు. దీంతో అక్కడి నేతలు కూడా అంతంగా ప్రచారాల్లో పాల్గొనలేదు. టీడీపీ గెలిపించేందుకే పవన్ రాజీ పడ్డట్లు కూడా మాటలు వినిపిస్తున్నాయి.

పవన్ టీడిపి ప్రణాళిక ఏంటి..? ఒప్పందం నిజమేనా..?

పవన్ టీడిపి ప్రణాళిక ఏంటి..? ఒప్పందం నిజమేనా..?

దీనికి తోడు పవన్ అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, సుజయ కృష్ణ, అయ్యన్నపాత్రుడు, రాజప్ప, యనమల, పుల్లారావు, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి, కే ఈ క్రీష్ణమూర్తి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాస్, పరిటాల సునీత, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ల నియోజకవర్గాల జోలికి అసలే వెళ్లలేదు. అంతేనా ఎక్కడా ప్రచారంలో టీడీపీ మంత్రుల అవినీతిని పవన్ ప్రశ్నించలేదు. ఎంతసేపు ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు తప్ప అదికార పార్టీ నేతలను పన్నెత్తి మాటనకపోవడం గమనార్హం.

English summary
There is an agreement between TDP and Jasanana in the election campaign. Pawan was leaving for Kuppam and Mangalgiri constituencies. Chandrababu has also been away from campaigning in the pavan kalyan constituencies.this what oppositions parties saying that there is a internal understanding between these two parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X