Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దసరా, దీపావళి పండుగల వేళ.. లక్షన్నర భారీ ఉద్యోగాలు ప్రకటించిన అమెజాన్

భారతదేశంలో పండుగల సందడి మొదలుకానుంది. ప్రస్తుతం త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతుంది. ఆపై దసరా, దీపావళి పండుగలు త్వరలోనే రానున్న నేపథ్యంలో , ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలను ప్రకటించింది. వినాయకచవితి నుంచి మొదలై దసరా, దీపావళి వరకు ఉండే పండుగల సీజన్‌లో పెరిగే డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈసారి భారీ ఉద్యోగావకాశాలను ఇవ్వనుంది. మొత్తం 1.5లక్షల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది.

భారీ ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్ ఇండియా

అమెజాన్ ఇండియా ప్రకటించిన ఈ ఉద్యోగాలు ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, కొచ్చి, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్‌పూర్ వంటి 400కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరికొన్ని ఉద్యోగాలు పరోక్షంగా కల్పించనున్నారు. ఈ నియామకాల్లో వేలాది మంది మహిళలకు, 2,000 మందికి పైగా దివ్యాంగులకు అవకాశం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది.

amazon india hiring 150000 employees in festival season

పండుగ సీజన్ తర్వాత కూడా అమెజాన్‌తోనే ఈ ఉద్యోగులు

కొత్త సిబ్బందిని ఇప్పటికే విధుల్లోకి తీసుకుంటున్నారని, వారందరికీ ట్రైనింగ్ కొనసాగుతుందని కూడా వెల్లడించింది. పండుగల సీజన్‌కు సంబంధించిన ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లు (FCలు), సార్ట్ సెంటర్‌లు, లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్‌లలో ఉన్నాయని సంస్థ పేర్కొంది. అమెజాన్ ఇండియా కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ, ఈసారి నియమించుకున్న చాలా మంది ఉద్యోగులు పండుగ సీజన్ తర్వాత కూడా అమెజాన్‌తోనే కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉద్యోగుల భద్రతకు అమెజాన్ అత్యధిక ప్రాధాన్యత

ప్రతి సంవత్సరం మా కంపెనీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యోగుల భద్రతకు అమెజాన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అని వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ వివరించారు. వారికి సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని అందిస్తామని, సామాజిక భద్రతా ప్రయోజనాలు, ఇతర సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ-కామర్స్ నెట్‌వర్క్‌లో తమ సిబ్బంది భద్రత కోసం దేశవ్యాప్తంగా 100 విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

డెలివరీ అసోసియేట్‌లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

తమ ఉద్యోగులకు తమ అనేక ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని, ఉద్యోగ భద్రత ఇస్తున్న సంస్థ తమదని ఆయన తెలిపారు. ప్రధాన నగరాల్లో 80,000 మందికి పైగా డెలివరీ అసోసియేట్‌లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు అభినవ్ సింగ్ వెల్లడించారు. ఇందులో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, BMI, సాధారణ శారీరక పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల్లోనే ప్రాథమిక చికిత్స (ఫస్ట్ ఎయిడ్) సదుపాయాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.

జీతంలో 80 శాతాన్ని నెలకు 20 రోజులు పూర్తవకముందే విత్ డ్రా ఫెసిలిటీ

ఉద్యోగులకు ఆర్థికంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి, తమ జీతంలో 80 శాతాన్ని నెలకు 20 రోజులు పూర్తవకముందే (నెల మొదటి 20 రోజుల్లోనే) విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పిస్తోందని వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. ఇది ఉద్యోగులకు చాలా వరకు ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+