టీడీపీ సేవకు పరిమితమైన టీటీడీ..!!
తిరుపతి తొక్కిసలాట ఘటన పైన రాజకీయంగా ప్రభుత్వం.. టీటీడీ పైన విమర్శలు మొదలు అయ్యాయి. టీటీడీ బోర్డు, అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయటం ద్వారా చంద్రబాబు వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్ని స్తున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు టీడీపీ సేవకు పరిమితం అయ్యారని అంబటి వ్యాఖ్యానించారు.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణ మని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. టీటీడీ చరిత్ర లో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగిందన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్ లు కట్టా రన్నారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారని గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. టీటీడీ ఛైర్మన్ గా ఉండి కూడా జగన్ పై రాజకీయ పరమైన విమర్శలు చేశారని చెప్పారు. బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదని విమర్శించారు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగిందని ఆరోపించారు.
దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారని.. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పా లని సూచించారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలని కోరారు. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలని... క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications