హార్మూజ్ ఓపెన్.. కానీ 115 కోట్ల బ్యారెళ్ల చమురు నష్టం.. భారత్ పై ప్రభావం..?

అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన చారిత్రక అవగాహన ఒప్పందంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం 'హార్మూజ్ జలసంధి' ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జూన్ 17న కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కు కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, గత మూడున్నర నెలలుగా సాగిన ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన చమురు కొరత అంత సులభంగా తీరేలా కనిపించడం లేదు. యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 115 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది.

హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం తెరుచుకున్నప్పటికీ, మైన్ల తొలగింపు ప్రక్రియ పూర్తి కావడం, రద్దు చేయబడిన ఖాళీ ట్యాంకర్లు తిరిగి రావడం మరియు ముడి చమురు ఉత్పత్తి పునరుద్ధరణ వంటి మౌలిక సవాళ్లు ఉన్నాయి. చమురు సరఫరా గొలుసు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు దశాబ్దాల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా ఓఈసీడీ చమురు నిల్వలు 1990 తర్వాత అతి తక్కువ స్థాయికి చేరాయి.

భారత్ పై ప్రభావం..?

భారత్.. తన అవసరాలకు సరిపడే ముడి చమురులో దాదాపు 65 నుంచి 70 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ఒప్పందం అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 80 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరల భారం వెంటనే తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాబోయే వేసవి కాలంలో పెరిగిన డిమాండ్ కారణంగా భారత్‌ లో ఇంధన ప్రియులపై అధిక ధరల భారం కొంతకాలం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

గోల్డ్‌ మన్ సాక్స్ సంస్థ 2026 చివరి త్రైమాసికానికి బ్రెంట్ క్రూడ్ సగటు ధరను 90 డాలర్ల నుండి 80 డాలర్లకు తగ్గించింది. అలాగే మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం సెప్టెంబర్ నాటికి ఇరాన్ ఉత్పత్తిలో 50 శాతం, డిసెంబర్ నాటికి 80 శాతం తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, అమెరికాలోని ప్రధాన చమురు కేంద్రమైన కుషింగ్ హబ్‌ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిల్వ కేంద్రాలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Hormuz Strait Reopened 115 Crore Barrels Oil Loss from Conflict Hits India Hard Hormuz Strait open

పరిస్థితులు చక్కబడుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నప్పటికీ, రవాణా సవాళ్లను అధిగమించడమే ఇప్పుడు చమురు పరిశ్రమ ముందున్న అతిపెద్ద సవాలు. కోల్పోయిన 115 కోట్ల బ్యారెళ్ల చమురు కొరతను పూర్తిగా భర్తీ చేయాలంటే ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తిని వేగవంతం చేయాల్సి ఉంటుంది. అంతవరకు ధరల్లో హెచ్చుతగ్గులు సహజమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+