ఇండిగో విమానంపై పిడుగు.. వామ్మో జర్రుంటే 140 మంది ప్రయాణికులు ఖతం..!
కోల్ కతా ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. 140 మంది ప్రయాణికులతో కోల్ కతా నుంచి అగర్తలా వెళ్లాల్సిన ఇండిగో విమానంపై పిడుగు పడింది. ఎయిర్ పోర్ట్ లో విమానం పార్క్ చేసి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే అప్పటికి విమానం బయల్దేరలేదు కాబట్టి విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఇండిగో విమానం 6E 6068 పై పిడుగు పడింది. శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో విమానం బోర్డింగ్ ప్రక్రియ పూర్తయింది. మరికొద్ది సేపట్లో విమానం టేకాఫ్ అవుతుంది అనగా ఈ షాకింగ్ ఘటన జరిగింది.
ఈ ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 141 మంది ఉన్నారు. అయితే విమానంపై పిడుగు పడిన ఘటనలో ఇద్దరు సిబ్బంది మాత్రమే గాయపడ్డారు. వారికి ఇప్పటికే వైద్య సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక పిడుగు పడడంతో విమానంలో పవర్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అయింది. కానీ ప్రయాణికులు సురక్షితంగానే బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇక పిడుగు పడిన వెంటనే విమాన సిబ్బంది ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిని మరో విమానంలో అగర్తలా పంపించారు. కోల్ కతాలో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కారణంగా విమానంపై పిడుగు పడినట్లు సమాచారం. ఇక కోల్ కతాలో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి.












Click it and Unblock the Notifications