అమరావతిపై వైసీపీ స్టాండ్ ఇదే-30 ఏళ్లకూ పూర్తి కాదు-తేల్చేసిన అంబటి..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ పార్టీ.. ఇప్పుడు తాజాగా తన వైఖరి మార్చుకుంది. మూడు రాజధానుల ఆలోచన లేదని, అమరావతినే అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలు వైసీపీ మారిన వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి విషయంలో తమ వైఖరేంటో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.

తాము రాజధాని అమరావతి కాదని ఎప్పుడూ చెప్పలేదని అంబటి రాంబాబు తెలిపారు. ఈ రోజు లక్ష కోట్ల రూపాయలను అమరావతి కోసం ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని, దీనిలో 52 వేల కోట్ల రూపాయల అప్పు అని తెలిపారు. ఇలా ప్రజాధనంను వృధా చేయడం ఎందుకన్నారు. గుంటూరు-విజయవాడ మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే రాజధానికి సరిపోతుందని వైయస్ జగన్ చెప్పారని అంబటి గుర్తుచేశారు.

Ambati Rambabu Clarifies YSRCP s Stand on Amaravati Capital and Jagan s View

కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చని, కానీ వాటికి నిధులు ఇవ్వాలంటే కష్టం అంటూ ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని అంబటి ఆక్షేపించారు. రాజధాని పేరుతో మాత్రం వేల కోట్లు అప్పులు తెచ్చి పెడుతున్నారన్నారు. ఉన్న ప్రాంతాలను రాజధానులుగా ఎంపిక చేసుకుంటారా? లేక రాజధానిని సృష్టిస్తారా? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అమరావతి పేరుతో లక్ష ఎకరాలను సేకరిస్తారా? అని అడిగారు.

Ambati Rambabu Clarifies YSRCP s Stand on Amaravati Capital and Jagan s View

హైకోర్ట్, శాసనసభ, సచివాలయం నిర్మిస్తే, దాని చుట్టూ రాజధాని అభివృద్ది చెందుతుందని అంబటి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడుతుంటే, లక్షల కోట్లు అప్పుల పాలు చేస్తున్నారన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు నేడు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందన్నారు. చివరికి కొత్తగా వేసిన హైవే రోడ్డును కూడా తవ్వితే కానీ నీరు బయటకు పోలేదన్నారు. దీనిని బట్టి అమరావతి ఎంత లోతట్టుప్రాంతమో తెలిసిపోతోందన్నారు.

Ambati Rambabu Clarifies YSRCP s Stand on Amaravati Capital and Jagan s View

అమరావతి చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అంబటి తెలిపారు. ఈ మూడున్నర ఏళ్ళు కాదు, ముప్పై ఏళ్ళు అయినా చంద్రబాబు చెబుతున్న హంగులతో కూడిన అమరావతి పూర్తి కాదన్నారు. అమరావతిని ఒక ఏటిఎంగా చంద్రబాబు మార్చుకున్నారన్నారు. మెబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, దానిలో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+