ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు ఫ్యామిలీ: దుమ్మెత్తిపోసిన అంబటి
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు. రాష్ట్రంలో ఆర్థిక లోటు నెలకొని ఉంటే, చంద్రబాబు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్స్ లో నివాసముండమేంటని నిలదీశారు. వృథా ఖర్చులతో ఖజానాను ఖాళీ చేస్తున్నారని ఆరోపించిన ఆయన, చంద్రబాబు తక్షణం తన ఫైవ్ స్టార్ హోటల్ నివాసాన్ని ఖాళీ చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు.
అనవసర ఖర్చులు చేస్తున్నారంటూ చంద్రబాబును నీరో చక్రవర్తితో పోల్చారు అంబటి. అలాగే, రాష్ట్రంలో కాపు భవనానికి, ఇతర సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టడం ఉద్దేశపూర్వకంగానే చేశారని, తీరా జీవో విడుదల చేశాక దీనిపై నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

మేథావులు, స్వామిజీలకు చంద్రబాబు రాజకీయాలు అంటగడుతున్నారని ఆరోపించిన అంబటి.. వాళ్లు హామిల అమలు గురించి మాట్లాడితే విషయాన్ని జగన్ మీదకు నెట్టేస్తారా..! అంటూ ప్రశ్నించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ కాపుల్లో చీలిక కోసం టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. మినీ మహానాడును కూడా టీడీపీ నేతలు దోచుకోవడానికే వాడుకుంటున్నారన్న అంబటి మినీ మహానాడులను 'మనీ మహానాడులు'గా అభివర్ణించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామిలపై చర్చించకుండా, వైఎస్ జగన్ పై నిందలు వేయడానికి టీడీపీ ప్రయత్నించడం సరికాదన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే, చంద్రబాబు వ్యక్తిగత నివాసాన్ని పునర్నిర్మిస్తుండడంతో కొంతకాలం పాటు మదీనాగూడ ఫామ్ హౌజ్ లో ఉన్న చంద్రబాబు కుటుంబం ఈమధ్యే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లోకి మారిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications