చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు..ఆ పార్టీ నేత షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పనికిరారని, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ప్రజారాజ్యం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ..ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా మారిందని వ్యాఖ్యానించారు.చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటరిచ్చారు.ప్రజారాజ్యాం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అంటూ అంబటి ప్రశ్నించారు.ఈ సమయంలో ఆయన చిరంజీవి రాజకీయాలకు పనికిరారని తేల్చేశారు.ఇక తిరుమల లడ్డూ వివాదంపై కూడా అంబటి స్పందించారు.జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎక్కడా ఆధారాలు లభించలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారిని వాడుకున్నారని అంబటి ఆరోపించారు.దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు.

జగన్ హయాంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపారని అంబటి చెప్పుకొచ్చారు.పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని అన్నారు.ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్‌లో నటుడు పృథ్వి వైసీపీని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగడంతో దిగొచ్చిన చిత్ర యూనిట్ క్షమాపణలు కోరింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. పృథ్వి చేసిన వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదని, మా సినిమాను అందరు ఆదరించాలని కోరారు.












Click it and Unblock the Notifications