ఒరేయ్ అనాల్సి వస్తుంది - ఉమాకు మంత్రి అంబటి వార్నింగ్ : సీఎం గురించి మాట్లాడితే..!!
టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక చేసారు. ప్రపంచంలో ఏ తప్పు చేయని విధంగా స్పిల్ వే పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాల్ కట్టి.. ఇప్పుడు అది కొట్టుకుపోవటానికి కారకులయ్యారని మంత్రి దుయ్యబట్టారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ వేసిన ప్రశ్నకు.. కేంద్రం ఇచ్చిన సమాధానం పైన టీడీపీ నేతలు ..తమ మద్దతు మీడియాతో వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ చేసిన పనుల కారణంగానే పోలవరం ఆలస్యం అయిందని మంత్రి స్పష్టం చేసారు.

ఒరేయ్..తురేయ్ అనాల్సి ఉంటుంది
గత ప్రభుత్వ చర్యల కారణంగానే నిర్దేశిత సమయానికి పోలవరం పూర్తి కాదని మంత్రి తేల్చి చెప్పారు. ఏమయ్యా రాంబాబు తెలుసుకో అంటున్నారని..మరో సారి అలా ఉంటే ఊరుకోనని..తాను ఒరేయ్.. తురాయ్ అనాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎం జగన్ పైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. సీఎం జగన్ తాడేపల్లి లోనే ఉంటున్నారని..ఏపీలో నివాసమే లేని వ్యక్తి ఏపీ సీఎం గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. దేవినేని ఉమా - బోండా ఉమా ఇద్దరూ వరదల విషయంలో ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. భారీ వరదల కారణంగా తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే కాళేశ్వరం లోపలు పంపు హౌస్ లోని నీరు వచ్చిందని..నష్టం జరిగిందని చెప్పారు.

టీడీపీ ప్రభుత్వ చర్యల కారణంగానే
పోలవరం ప్రాజెక్టుకు తాము ఎటువంటి నష్టం లేకుండా చేసుకున్నామన్నారు. లోయర్ కాపర్ డ్యాం ముగినిపోయిందని.. అది కూడా టీడీపీ చేసిన పనులే కారణమని చెప్పుకొచ్చారు. దుర్గార్యమైన పాలన చేసి..పోలవరం గురించి తమ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరద సాయం గురించి మాట్లాడుతున్నారని.. ఈ స్థాయిలో వరదలు వస్తే ఏ ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి రూ రెండు వేలు సాయం అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారా అంటూ రాంబాబు ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం జరుగుతున్నా...లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరక్కుండా కంటికి రెప్పలా కాపాడామని మంత్రి చెప్పుకొచ్చారు.

ప్రజలను రెచ్చగొట్టేందుకే పర్యటనలు
నిపుణులు ఎవరైనా ఉంటే డయాఫ్రం వాల్ ఎలా కడుతారో చెప్పమని డిమాండ్ చేసారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపన తమకు ఉందని వివరించారు. చంద్రబాబు ఇప్పుడు వరదల ప్రాంతానికి వెళ్లి..రెచ్చగొట్టటానికి వెళ్లారని ఆరోపించారు. వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని.. అప్పటి వరకు చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా.. పోలవరం ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం వచ్చిన వరదలను సైతం స్పిల్ వే ద్వారా పంపించామని మంత్రి స్పష్టం చేసారు. 2018లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన దేవినేని ఉమా మహేశ్వర రావు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేసారు.