అమెరికాలో కేసు, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు: కేవిపీకి ప్రత్యామ్నాయాలు
హైదరాబాద్: టైటానియం నిక్షేపాల వెలికితీతకు అనుమతుల్లో కుట్ర పైన అమెరికా నమదోు చేసిన కేసులో ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ నోటీసులు చెల్లవని నిరూపించుకోవడానికి కేవీపీ రామచంద్ర రావుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నేషనల్ సెంట్రల్ బ్యూరో హైకోర్టుకు నివేదించింది.
కేసు వివరాలను, కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ తదితర ఆధారాలన్నీ పరిశీలించి ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేస్తుందని తెలిపింది. రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం నిందితులను అప్పగించాల్సి ఉంటుందని, అయితే దానికి ముందు కేవీపీకి పత్రాలు అందచేస్తామని, రెడ్ నోటీసులు అన్యాయమని భావిస్తే ఆయన కోర్టులో నిరూపించుకోవాలన్నారు. ఉన్నత న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చునన్నారు.

కాగా, ఇంటర్ పోల్ నోటీసులను సవాలు చేస్తూ గత ఏడాది ఏప్రిల్ నెలలో కేవీపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారించిన న్యాయస్థానం నోటీసు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టవద్దని సీఐడీ డీజీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేవీపి దాఖలు చేసిన పిటిషన్ పైన సీబీఐలో భాగమైన ఎన్‌సీబీ గత ఆగస్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆయన పిటిషన్ కొట్టివేయాలని కోరింది. ఈ సమాచారం బయటకు వచ్చిందని ప్రముఖ తెలుగు దినపత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications