• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలా

|
Google Oneindia TeluguNews

దేశద్రోహం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన కేసులో అరెస్టయి, కస్టడీలో అనుమానిత గాయాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ పై విడుదైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా కాలం తర్వాత తొలిసారి గురువారం మీడియాతో నేరుగా మాట్లాడారు. కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదన్న బెయిల్ షరతు ఉన్నప్పటికీ, రాజద్రోహం వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా చేసిన కామెంట్లు, కేంద్రానికి చేసిన సూచనలను ఊతంగా భావించినట్లుగా రఘురామ రెచ్చిపోయి మాట్లాడారు. వివరాలివి..

టార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివేటార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివే

సెక్షన్ 124ఏపై సీజేఐ ఆందోళన

సెక్షన్ 124ఏపై సీజేఐ ఆందోళన

బ్రిటిష్ జమానాలో స్వాతంత్ర్యపోరాటాన్ని అణిచివేసేందుకు తెల్లదొరలు చేసిన రాజద్రోహం చట్టాలను ఇప్పటికీ అనుసరిస్తుండటంపై సీజేఐ రమణ ఆందోళన వ్యక్తి చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి చట్టాలు అవసరమా అని ప్రశ్నిస్తూ, సదరు చట్టం దుర్వినియోగంపై కేంద్రం దృష్టి సారించాలని సీజేఐ అన్నారు. దేశంలో దేశద్రోహం కేసులు విచ్చలవిడిగా పెరుగుతుండటంపై దాఖలైన ఓ పిటిషన్ ను విచారిస్తూ మంగళవారం ఆయనీ కామెంట్లు చేశారు. ఇదే సెక్షన్ 124ఏను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కొంత కాలంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అటు సీజేఐ రమణ వ్యాఖ్యలు, ఇటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రఘురామను ఉద్దేశించి సాయిరెడ్డి చేసిన కామెంట్ల నేపథ్యంలో రెబల్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్‌ సిద్దూ -పీసీసీ చీఫ్‌గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలాకాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్‌ సిద్దూ -పీసీసీ చీఫ్‌గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలా

హిట్లర్ బతికుంటే జగన్‌ను చూసి..

హిట్లర్ బతికుంటే జగన్‌ను చూసి..


''దేశద్రోహం కేసులకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అద్భుతమైన కామెట్లు చేశారు. దుర్మార్గమైన సెక్షన్ 124ఏని రద్దు చేయాల్సిందిగా నేను గత కొంతకాలంగా పోరాడుతున్న సంగతి మీకు తెలిసిందే. మా వైసీపీ ఎంపీలకు కాకుండా, దేశంలోని మిగతా ఎంపీలకు, అన్ని రాష్ట్రాల సీఎంలకు, గవర్నర్లకు సెక్షన్ 124ఏ రద్దుపై నేను లేఖలు రాశాను. పార్లమెంట్ లోనూ గళం వినించాను. దేశద్రోహం కేసులకు అవకాశమిచ్చే సెక్షన్ 124ఏ నిజంగా పిచ్చోడి చేతిలో రాయి లేదా ఫ్యాక్షనిస్టు చేతిలో కత్తి లాంటిది. ప్రత్యర్థుల్ని మటుమాయం చేయడానికి జగన్ లాంటి వాళ్లు ఒక సాకుగా దీన్ని వాడుకుంటున్నారు. నరకాసురుడు, హిట్లర్ లాంటివాళ్లు బతికుంటే, ఇప్పుడున్న నియంత పాలకులను చూసి సిగ్గుతో తలదించుకునేవారు.

నేను విన్నాను.. ఉన్నాను అనేది కోర్టులే

నేను విన్నాను.. ఉన్నాను అనేది కోర్టులే

ఏపీలో అనూహ్య పరిస్థితుల నడుమ న్యాయస్థానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాయన్న నా వాదన, ప్రజల విశ్వాసం నిజమేనని నిరూపణ అవుతున్నది. నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాటను కొందరు రాజకీయంగా చెబితే, నిజంగా ఆ పనిని కోర్టులు మాత్రమే చేసి చూపుతున్నాయి. జగన్ సర్కారుకు సంబంధించి ఒకటీ రెండూ కాదు, వందల కొద్దీ కేసుల్లో వెలువడిన తీర్పులను మనం వింటున్నాం. తాజాగా ఉపాధి హామీ నిధుల ఎగవేతలపైనా హైకోర్టు జగన్ సర్కారుకు డెడ్ లైన్ విధించింది. ఏపీలో అన్ని ఏ విషయానికైనా కోర్టుల్లోనే న్యాయం దక్కుతోందని ఆనందపడాలో, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంగా మనం విఫలమయ్యామని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి..

మెడలు వంచుతామని కాళ్లు పడతారేం?

మెడలు వంచుతామని కాళ్లు పడతారేం?

ఏపీలో జనం సమస్యలన తీర్చాల్సిందిపోయి, రఘురామ అనర్హతవేటుపై పార్లమెంటును స్తంభింపజేస్తామని మావాళ్లు చెప్పడం నిజంగా సిగ్గు చేటు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని చదువుకోమని నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయ్యా, జగన్ గారు.. దిమాక్ ఉన్న ఒక్కడినైనా పక్కన పెట్టుకోండి, మందర, శకుని అంశకు చెందిన సాయిరెడ్డి లాంటి వాళ్లను ఎందరినీ పెట్టుకుంటే మీరు రావణుడు లేదా దుర్యోధనుడిగానే మిగిలిపోతారు. ఇవాళ్టి పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రఘరామ వ్యవహారంపై చర్చించారా? అని మీడియా అడిగితే, 'ముఖ్యమంత్రి స్పందించేత స్థాయి ఆ నర్సాపురం ఎంపీది కాదు, అతనో క్యారెక్టర్ లెస్ ఫెలో' అని సాయిరెడ్డి పిచ్చి కూతలు కూశాడు. అవునుమరి, మెడలు వంచుతానని శపథం చేసి చివరికి కాళ్లు పట్టుకునేదాకా రావడం నా స్థాయి కాదు మరి..

జగన్‌పై మాట్లాడి స్థాయి తగ్గించుకోను

జగన్‌పై మాట్లాడి స్థాయి తగ్గించుకోను


దుర్మార్గపు చట్టం కింద నన్ను అరెస్టు చేసి 24 గంటలపాటు జైలులో పెట్టారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డిలు కొన్ని నెలలపాటు జైలులో ఉన్నారు. జైలు కాలమే గొప్ప అర్హత అయితే అది నాకు లేదు. దొంగ లెక్కలు వేయడం, తోటి ఖైదీలు, రాజకీయ మహిళామణులు, మహిళా అధికారులతో సాయిరెడ్డి ఉన్నంత చనువుగా నేను ఉండలేను. పుట్టినరోజుకు ముందే ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టించుకునే స్థాయి కూడా కాదు నాది. నా క్యారెక్టర్, కండక్ట్ ఏమిటో నా తోడపుట్టినవాళ్లు, లేదా నా కజిన్స్ ను అడిగితే తెలుస్తుంది. మరి జగన్ క్యారెక్టరేంటో వాళ్ల చెల్లెళ్లే చెప్పాలి. అసలు విజయసాయిరెడ్డి ఫ్యామిలీ చరిత్రను కూడా మాట్లాడుకోవాలి. ఏరకంగా చూసినా వాళ్ల స్థాయికి తగని వ్యక్తిని కాబట్టే నన్ను చూస్తే జగన్, సాయిరెడ్డికి అసహ్యం కలుగుతుంది. ఇకపై వీళ్లిద్దరి గురించి మాట్లాడి నేను స్థాయిని తగ్గించుకోను. అయితే, భాష ముఖ్యమని చెప్పడానికి, ఇంకోసారి నన్ను క్యారెక్టర్ లేనోడని తిట్టొద్దని చెప్పడానికే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను..'' అని ఎంపీ రఘురామ అన్నారు.

English summary
on section 124A sedition charges, ysrcp parliamentary party meeting, mp raghurama latest newsamid cji nv ramana expressed concern on sedition changes under section 124A, narsapuram ysrcp mp raghu rama krishnam raju, who is fighting against the same law has made key comment. after a long time, rebel mp raghu rama calls for press meet on thursday. raghurama slams ap cm ys jagan and ysrcp mp vijayasai reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X