TGEAPCET స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కల నిజం చేసిన మెగాస్టార్.. వీడియో వైరల్ !!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచి 'టీజీ ఈఏపీసెట్ 2026'లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరు.. ఇప్పుడు ఈ ఘటనతో మరోమారు ప్రశంసలు అందుకుంటున్నారు.
కాగా హైదరాబాద్‌లోని ప్రముఖ Resonance Junior College విద్యార్థిని అయిన రుషి, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆమె కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించడం విశేషంగా మారింది. చిరంజీవిని ఒకసారి అయినా ప్రత్యక్షంగా కలవాలని రుషి చిన్నప్పటి నుంచే కలగనేదని కుటుంబ సభ్యులు తెలిపారు. "బాగా చదివి పెద్ద ర్యాంక్ సాధిస్తే చిరంజీవి గారిని తప్పకుండా కలుస్తావు" అని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించేవారని వెల్లడించారు.

ఆ మాటలను నిజం చేస్తూ రుషి రాష్ట్రంలోనే తొలి ర్యాంక్ సాధించగా, చిరంజీవి స్వయంగా ఆమెను కలిసి అభినందించడం ఆ కుటుంబానికి మరపురాని క్షణంగా మారింది. ఈ సందర్భంగా ఆమె అంకితభావం, కష్టపడే తత్వాన్ని మెచ్చుకున్న చిరంజీవి, "నువ్వు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు" అంటూ ఆశీర్వదించారు. అంతే కాకుండా రుషి ప్రతిభకు గుర్తింపుగా చిరంజీవి ఆమెకు ఒక ఆధునిక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రుషి మాట్లాడుతూ, "ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ అధికారి కావడం నా లక్ష్యం" అని తెలిపింది. ఆమె మాటలు విన్న చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. దాంతో దేశానికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్న విద్యార్థులు మరింత ముందుకు రావాలని.. నీలాంటి పిల్లలు సమాజానికి ఆదర్శం" అని ఆయన అభినందించారు. "తనను కుటుంబ సభ్యుడిలా భావించాలని అన్నారు. రుషి తల్లిదండ్రులతో మాట్లాడిన చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. "అమ్మాయి కలలను నిజం చేసుకునేలా ఎప్పుడూ ప్రోత్సహించండి. భవిష్యత్తులో చదువుకు, కెరీర్‌కు ఏ సహాయం కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా నన్ను సంప్రదించండి. నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించండి" అని భరోసా ఇచ్చారు.
చిరంజీవి మాటలకు రుషి కుటుంబ సభ్యులు ఆనందంతో కంటతడి పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతూ, మెగాస్టార్ గొప్ప మనసును అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈఏఎంసెట్ పరీక్ష ప్రస్తుతం ఈఏపీసెట్‌గా కొనసాగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎక్కువగా అబ్బాయిలే టాప్ ర్యాంకులు సాధిస్తూ వచ్చారు. అయితే ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ టీజీ ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రుషి చరిత్ర సృష్టించింది.
#TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️
— Team Megastar (@MegaStaroffl) May 20, 2026
Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨
Today, that promise was fulfilled as… pic.twitter.com/y97hKTjSDO












Click it and Unblock the Notifications