ఎండల తీవ్రత వేళ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచన..!!
ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉండటంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయింది. వాతావరణ శాఖ తాజా అంచనా ల మేరకు అలర్ట్స్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు ఇదే తరహాలో ఎండలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వల్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవా లని ఆదేశించారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అలర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు, రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

అధికారులకు కీలక ఆదేశాలు
అదే సమయంలో వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కీలక సూచన చేశారు. వడదెబ్బ తో ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలన్నారు. పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బాధితులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం. మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.













Click it and Unblock the Notifications