తిరుమలకు వెళ్తున్న భక్తులకు కీలక అప్డేట్..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో భక్తులకు శ్రీవారి సేవకులు సైతం సేవలు అందిస్తున్నారు.
వేసవి ఎండలు పెరుగుతున్నా.. ప్రతి రోజూ తిరుమలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికిపైగానే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సిఫార్సు లేఖలను ఇప్పటికే రద్దు చేసిన టీటీడీ అధికారులు, భక్తులు వేగంగా, సులువుగా స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లలో ఉన్న వారికి శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, మజ్జిగ, మంచినీరు, పాలను పంపిణీ చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్ గోగర్భం డ్యాం వరకు సాగింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.

భక్తులతో కిటకిట
పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ క్యూ లైన్ మేనేజ్ మెంట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కమాండ్ సెంటర్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం వేగంగా చేయిస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఎస్ఎస్డీ టోకెన్లున్న భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం టోకెన్లున్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.













Click it and Unblock the Notifications