'డ్రాగన్' గ్లింప్స్ లో ఎన్టీఆర్ నే డామినేట్ చేసిన ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు డ్రాగన్ మూవీ గ్లింప్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలను తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ గ్లింప్స్ ఏ రేంజ్ లో అయితే ఫ్యాన్స్ ఊహించుకున్నారో అంతకుమించిన రేంజ్ లోనే డ్రాగన్ గ్లింప్స్ ఉంది. నిన్న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఈ గ్లింప్స్ రిలీజ్ అయింది. మొత్తం 4 నిమిషాల 29 సెకన్ల నిడివితో వచ్చిన ఈ వీడియో డ్రాగన్ మూవీలోని ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేసింది. గ్లింప్స్ చూస్తుంటే ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోందని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో ఒక్కో విలన్ ను పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. మొత్తం ఏడుగురు విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

గ్లింప్స్ లో హీరోయిన్ రుక్మిణి విలన్ల పాత్రలను పరిచయం చేసింది. ఆ వివరాలు చూస్తే ముఖ్యమైన పాత్ర ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ(ఏటీసీ)కి అధిపతిగా అశుతోష్ రాణా కనిపిస్తున్నారు. ఆయన దాదా సర్కార్ పాత్రలో నటిస్తున్నారు. ఆ తర్వాత నటుడు అన్షుమాన్ పుష్కర్ ఏటీసీకి సెకండ్ ఇన్ కమాండ్ గా సుజోయ్ సర్కార్ పాత్ర, ఏటీసీకి ఉన్నతస్థాయి అధికారి పాత్రలో సిద్ధాంత్ గుప్తా బాబీ సర్కార్ గా, అలాగే అకౌంటెంట్ గా గురు సోమసుందరం, విక్టర్ మిన్ష్ కోవ్ అనే పాత్రలో భీమల్ జీత్ ఒబెరాయ్ రష్యాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ గా కనిపించనున్నాడు. ఆ తర్వాత జనరల్ దురాన్ పాత్రలో సోమాలియా స్వయం ప్రకటిత ప్రభువుగా అలెగ్జాండర్ మిజెవ్ అలరించనున్నాడు.
ఇక లూగర్ పాత్రలో ఎన్టీఆర్ అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటడు అనిల్ కపూర్.. ఇండియన్ నార్కొటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ గా కనిపిస్తున్నారు. అయితే వీరిలో ఓ పాత్ర ఎన్టీఆర్ పాత్రను సైతం డామినేట్ చేసే విధంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అతని పేరే రాఘవ్ జుయల్.. ఇతను బాలీవుడ్ లో ఎక్కువుగా డాన్స్ ప్రోగ్రామ్స్ తో వైరల్ అయ్యాడు. 2023 లో కిల్ మూవీతో వెండితెర ఆరంగేట్రం చేశాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీలోనూ నటిస్తున్నాడు. మరి డ్రాగన్ మూవీలో రాఘవ్ జుయల్ రోల్ ఎలా ఉంటుందో తెలియాలంటే మూవీ రిలజ్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.. ఇక డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది జూన్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications