టీడీపీకి వ్యూహకర్త మార్పు, తెర మీదకు పీకే - ఏం జరుగుతోంది..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ ఈ ఎన్నికల్లో నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా బరిలోకి దిగుతోంది. జనసేనతో పొత్తు తో అధికారానికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో గతంలో జగన్ సీఎం అవ్వటంలో సహకరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేళ టీడీపీకి వ్యూహకర్తగా పని చేయబోతన్నాని ప్రచారం సాగుతోంది. దీని పైన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు అసలు విషయాన్ని బయట పెట్టారు.

ఏపీ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తిరిగి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం తమ రాజకీయ వ్యూహకర్తను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ పేరు తెర మీదకు వచ్చింది. టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారంటూ ప్రచారం సాగుతోంది. 2014లో ప్రధాని మోదీ గెలుపులో.. అదే విధంగా కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్ సహా ఏపీలో వైయస్ జగన్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు. తాను నెలకొల్పిన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలిగారు. తన సొంత రాష్ట్రం బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు.

Amid reports that Prashant Kishor is likely to work with TDP, his colleagues Denied

కొంతమంది టీమ్‌తో కలిసి రాజకీయాలపై ఆసక్తి గలిగిన యువతతో కలిసి ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్యం బీహార్ పాలిటిక్స్. అక్కడ తనదైన మార్క్ రాజకీయాలు చేసేపనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నది ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ కోసం మరో రాజకీయ వ్యూహకర్త పని చేస్తున్నారు. కానీ, ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేయటానికి రానున్నారనే ప్రచారం వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కానీ...ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ వ్యూహకర్తగా ఇక పని చేయనని..తాను ఐ ప్యాక్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే పీకే ప్రకటించిన అంశాన్ని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+