• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచైత మామూలుగా ఇవ్వలేదుగా - కూతుళ్లకు హక్కులపై చంద్రబాబు ట్వీట్.. బాబాయికి చెప్పండంటూ..

|

అవకాశం దొరికిన ప్రతిసారి.. సున్నితంగానైనా చాలా స్ట్రాంగ్‌గా.. ప్రత్యర్థులకు కౌంటర్లివ్వడంలో రాటుదేలుతున్నారు మన్సాన్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచైత గజపతిరాజు. వారసత్వ పోరులో అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమె.. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తన బాబాయి అశోక్ గజపతి రాజు, టీడీపీ చీఫ్ చంద్రబాబులపైకి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమలు గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దానిపై కీలక వివరణ ఇచ్చింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, తండ్రి ఆస్తిలో వాటా పొందేందుకు ఆమెకు అన్ని హక్కులుంటాయని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి రావడానికి పూర్వమే తండ్రి మరణించినప్పటికీ, ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు ఆయన కుమార్తెకు ఉంటుందని, ఆమె సమష్టి కుటుంబ భాగస్థురాలేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించగా, దానికి సంచైత అనూహ్యరీతిలో కౌంటరిచ్చారు.

రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి' కోలాహలం

ఆడపడుచులకు టీడీపీ ప్రాధాన్యం..

ఆడపడుచులకు టీడీపీ ప్రాధాన్యం..

కుమారుడితో సమానంగా కుమార్తెకూ ఆస్తిలో సమానహక్కు ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ చీఫ్ చంద్రబాబు స్వాగతించారు. అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పునివ్వడం సంతోషకరమని అన్నారు. ‘‘ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని నాలుగు దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ ఆకాంక్షించి, అమలుచేశారు. రాజకీయాల్లోనూ, చట్టసభల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశమే. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు మహిళాశక్తిని చాటింది కూడా తెలుగుదేశమే''అని గుర్తుచేశారు.

రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..

  Vijayawada దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు కు Pawan Kalyan డిమాండ్!! || Oneindia Telugu
  మహిళా ఛాపియన్ మీరు..

  మహిళా ఛాపియన్ మీరు..

  సుప్రీం తీర్పు నేపథ్యంలో, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీనే అని గుర్తుచేసిన చంద్రబాబును ఛాపియన్ గా అభివర్ణించారు సంచైత గజపతి రాజు. చెప్పే మాటలను ఆచరించి చూపాలని, వారసత్వం విషయంలో అశోక గజపతి రాజు అదే పనిగా తనపై చేస్తోన్న విమర్శల దాడి ఆగేలా, హక్కుల గురించి మీరైనా ఆయనతో చెప్పండంటూ చంద్రబాబుకు సంచైత సూచించారు. తాను అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతిరాజుకు చట్టబద్ద వారసురాలిననే విషయాన్ని మరోసారి దృష్టికి తెస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. చెప్పిందే ఆచరించే సీఎం జగన్ కు ధన్యవాదాలంటూ సంచైత చివర్లో రాసుకొచ్చారు.

  English summary
  MANSAS Trust Chairperson Sanchaita Gajapati Raju once again made key remarks on tdp chief chandrababu and ashok Gajapati Raju amid supreme court ruling on daughters rights. sanchaita asked babu and ashok to stop attacking her.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X