చంద్రబాబుకు అమిత్ షా అనూహ్య ఫోన్ కాల్.. దానిపై ఆరా !!

Chandrababu Naidu: లోక్‌సభ సమావేశాలు సోమవారం ఆరంభం కానున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పార్లమెంట్ సమావేశం కాబోతోండటం ఇదే తొలిసారి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది.

లోక్‌సభ సమావేశం కాబోతోనన్న నేపథ్యంలో కొత్త స్పీకర్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఈ పదవిపైనే అందరి దృష్టీ నిలిచింది. ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) ఈ పదవిని దక్కించుకోవడంపై పావులు కదుపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి.

Amit Shah called Chandrababu Naidu to discuss Lok Sabha speaker election

దీనికి కారణాలు లేకపోలేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సొంత బలం భారతీయ జనతా పార్టీకి లేదు. లోక్‌సభ మేజిక్ ఫిగర్ 272. కాగా బీజేపీకి 240 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలం 292. ఇందులో తెలుగుదేశం పార్టీ వాటా 16. జేడీయూకు ఉన్న సభ్యులు 12 మంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని బీజేపీ అందుకుందీ అంటే ఈ రెండు పార్టీల చలవే అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

ఈ నేపథ్యంలో కీలకమైన లోక్‌సభ స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేశాయంటూ వార్తలు వచ్చాయి.. గానీ అది తేలిపోయింది. కేంద్ర మంత్రివర్గంలో రెండు పదవులను తీసుకుంది టీడీపీ. పౌర విమానయానం, గ్రామీణాభివృద్ధి శాఖలు రెండూ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో వచ్చిపడ్డాయి.

ఈ పరిస్థితుల్లో స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. దీనిపై చర్చించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని అన్నారు.

స్పీకర్ పదవి తమకు అవసరం లేదని అమిత్ షాకు స్పష్టం చేసినట్లు చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని కోరినటట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నందున.. సమయానుకూలంగా నిధులను విడుదల చేయాలని అమిత్ షాను కోరానని పేర్కొన్నారు. పదవులు తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+