జగన్ గుర్తు పెట్టుకో, అమిత్ షా సంచలనం- అమరావతిపై క్లారిటీ..!!
ఏపీలోని జగన్ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటానికి కారణాలను వెల్లడించారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో - రాష్ట్రంలో ఎన్గీఏను గెలిపించాలని కోరారు. పార్లమెంట్, అసెంబ్లీలో భారీ మెజార్టీ వచ్చేలా మద్దతు ఇవ్వాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
జగన్ ప్రభుత్వం పై ఆరోపణలు
ఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికే, గూండాగిరి, భూమాఫియా అంతానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్‌షా స్పష్టం చేశారు. ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కూటమిని గెలిపించండి.. ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోదీ చేతుల్లో పెట్టాలని అమిత్‌షా కోరారు.

ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమస్థానంలో నిలిపారని చెప్పుకొచ్చారు. జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం చేయకపోగా.. మద్యం సిండికేట్‌కు తెరలేపారని విమర్శించారు. అట్టహాసంగా ఆరోగ్యశ్రీ ప్రకటించి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు, మోదీని గెలిపిస్తే సీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఎన్డీఏను గెలిపించండి
ఏపీలో 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆంధ్రాలో గూండాగిరి అంతానికి కూటమిగా ఏర్పడ్డామని.. అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి..ఆంధ్రాలో భూమాఫియా అంతానికే కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు.
తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతామని చెప్పుకొచ్చారు. జగన్ ఇంగ్లీషు భాష కోసం పాఠశాలల్లో తెలుగు లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి గుర్తుంచుకో.. భాజపా ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వమని చెప్పుకొచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా అమిత్‌షా పేర్కొన్నారు.
"ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని అంతం చేసేందుకు, ఇసుక మాఫియాను అంతు చూసేందుకు, అమరావతిని రాజధానిగా చేసేందుకు, తిరుపతి వెంకన్న పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు, తెలుగు భాషను పరిరక్షించేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమితో అక్రమార్కుల అంతుచూస్తాం" - కేంద్రమంత్రి శ్రీ @AmitShah గారు… pic.twitter.com/LNIWXGjdoQ
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 5, 2024
అమరావతే రాజధాని
పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో భాజపా కీలకపాత్ర వహించిందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి అవుతుందని చెప్పారు. చట్టసభలో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లు తెచ్చామని వివరించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని అమిత్‌షా ప్రశ్నించారు. మళ్లీ మూడోసారి ప్రధాని అయ్యేది మోదీనే అని షా స్పష్టం చేసారు. మొదటి రెండు దశల్లోనే మోదీ సెంచరీ కొడతారన్నారు. తర్వాతి దశల్లో మొత్తం 400కు పైగా సీట్లు సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications