చంద్రబాబుకు అమిత్ షా ఫోన్: విభజన హామీలపై 5న చర్చిద్దామని పిలుపు, సుజనా బృందం

న్యూఢిల్లీ/అమరావతి: రెండో విడత పార్లమెంటు సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు.

Recommended Video

    Galla Jayadev Shocking Counter To Arun Jaitley

    విభజన హామీలపై మార్చి 5న చర్చిద్దామని శుక్రవారం ఫోన్ చేసిన అమిత్ షా.. బాబుకు తెలిపారు. దీంతో కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బృందాన్ని ఈ చర్చలకు పంపుతామని చంద్రబాబు ఆయనకు తెలిపారు.

    హామీలు అమలు చేయాల్సిందే

    హామీలు అమలు చేయాల్సిందే

    విభజన హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. తమ పోరాటం కేంద్రంపై కాదని, ప్రజల డిమాండ్ల కోసమే పట్టుబడుతున్నామని చెప్పారు. హామీల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. కాగా, సుమారు 5నిమిషాల పాటు వీరి సంభాషణ జరిగింది. షా, ఎంపీ రామ్మోహన్ భేటీని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది.

    భేటీ అనంతరమే షా ఫోన్

    భేటీ అనంతరమే షా ఫోన్

    టీడీపీ పార్లమెంటరీ భేటీ తర్వాత చంద్రబాబునాయుడుకు అమిత్ షా నుంచి ఫోన్ రావడం గమనార్హం. తొలి విడత సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో తమ వాదనను గట్టిగా వినిపించిన విషయం తెలిసిందే.

    ఫోన్ చేశారు కానీ, పోరాటం ఆపొద్దు

    ఫోన్ చేశారు కానీ, పోరాటం ఆపొద్దు

    రాష్ట్ర హక్కుల సాధనలో పోరాటంలో రాజీ పడొద్దని సీఎం చంద్రబాబు ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో అన్నట్లుగా సమాచారం. అమిత్‌షా తనకు ఫోన్‌ చేసిన వెంటనే ఆయన పలువురు నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమిత్‌ షా తనకు ఫోన్‌చేసిన విషయాన్ని వారితో పంచుకున్నారు. చర్చలు జరుగుతున్నా హక్కుల సాధన విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన స్పష్టంచేశారు.

    ఎంపీల భేటీలో చంద్రబాబు ఆగ్రహం

    ఎంపీల భేటీలో చంద్రబాబు ఆగ్రహం

    విభజన జరిగి నాలుగేళ్లయినా ఆ గాయాలు ఇంకా మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక్కో ఎంపీ నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాదని, వద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందునే ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండదని చెప్పి.. ఇప్పుడు కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నందును ఆంధ్రప్రదేశ్‌కు అదే పేరుతో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పార్టీకి విశ్వసనీయత లేదు.. నాటకాలు ఆడుతోందని ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని చంద్రబాబు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+