AP Election Results : ఏపీలో కొత్త ప్రభుత్వం ఫిక్స్ - తేల్చేసిన అమిత్ షా...!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సైతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై పలు రిపోర్టులు అందాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో హోంమంత్రి అమిత్ షా తాజాగా మరోసారి ఏపీలో ఏం జరిగిందో చెప్పేశారు.
తాజాగా జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడం ఖాయమని అమిత్ షా తేల్చిచెప్పేశారు. ఈ ఇంటర్వ్యూలో ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై మీ అంచనాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఒడిశాలో 17 లోక్ సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామన్నారు.

అలాగే ఏపీలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, అలాగే భారీ మొత్తంలో లోక్ సభ సీట్లను కూడా గెల్చుకోబోతున్నట్లు అమిత్ షా తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారతంలో ప్రబల శక్తిగా ఉన్న బీజేపీ.. ఈసారి తూర్పు, దక్షిణ భారతంలోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ-జనసేనతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో విజయంతో పాటు గణనీయంగా లోక్ సభ సీట్లు సాధించడంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో కూటమి గెలుస్తోందని మోడీతో పాటు అమిత్ షా కూడా పలుమార్లు పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలో నిజమెంతో జూన్ 4న తేలిపోనుంది.












Click it and Unblock the Notifications