మంత్రి రోజా చెప్పులు మోసిన చిరుద్యోగి - వైరల్..!?

మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ చిరుద్యోగి మంత్రి చెప్పులు మోయటం వైరల్ అవుతోంది.

మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం మాటల తూటాలతో ప్రతిపక్ష పార్టీల పై విరుచుకుపడే రోజా సూర్యలంక బీచ్ పర్యటకు వెళ్లారు. అక్కడ చోటు చేసుకున్న ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. మంత్రికి పర్యాటక రిసార్ట్స్ వద్ద అధికారులు స్వాగతం పలికి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు. ఆ సమయంలో తన చెప్పులను బయట విడిచి పెట్టారు. అక్కడే వివాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి లక్ష్యంగా నెటిజెన్లు స్పందిస్తున్నారు.

పర్యాటకశాఖ మంత్రి రోజా బాపట్ల జిల్లా సూర్యలంక కొద్ది సేపు సముద్ర జలాల్లోకి దిగారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయట విడిచిపెట్టారు. వాటిని జాగ్రత్తగా చూడాలని రోజా వ్యక్తిగత సహాయకుడు సిబ్బందికి సూచించారు. స్థానికంగా పని చేసే రిసార్ట్స్ ఉద్యోగి మంత్రి చెప్పులను తడిసిపోకుండా వాటిని చేతితో పట్టుకుని తిరిగారు. కొద్దిసేపు చేత్తో మోసి..తరువాత పక్కన పెట్టారు. మంత్రి ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. అయితే ఉద్యోగి ఇలా చెప్పులు మోయటం వివాదాస్పదంగా మారింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. బీచ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మంత్రి రోజా చెప్పులు వేసుకొని రిసార్ట్స్ కు వెళ్లిపోయారు.

An employee carried the minister Roja sandals., Videos of this have now gone viral.

దీని పైన ఆ ఉద్యోగి స్పందించారు. మంత్రి చెప్పులు పట్టుకోవాలని తనకు ఎవరూ చెప్పలేదన్నారు. సముద్రంలో అలల కారణంగా చెప్పులు కొట్టుకుపోతాయని, తానే చేత్తో తీసి పక్కన పెట్టానని చెప్పుకొచ్చారు. తాను చెప్పులు పట్టుకోవటం గురించి మంత్రి ఎందుకు చేతితో చెప్పులు పట్టుకున్నావని మంత్రి మందలించారని వివరించారు. ఇక..సూర్యలంక బీచ్ లో పర్యటక శాఖకు కేటాయించిన 8 ఎకరాల్లో త్వరలో రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి రోజా వెల్లడించారు.గతంలో కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవి శంకుస్థాపన చేసినా అవి నిర్మాణం పూర్తి కాకపోవటానికి నిధుల సమస్య అయి ఉండ వచ్చిన మంత్రి రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+