బాబుకు మరో షాక్, ఆ పదవి కోసం పట్టు: జగన్ వైపు ఆనం బ్రదర్స్?

ఏపీలో టిడిపికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కర్నూలులో శిల్పా సోదరులు వైసిపిలో చేరారు. ఇప్పుడు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోను ఆ పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.

అమరావతి: ఏపీలో టిడిపికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కర్నూలులో శిల్పా సోదరులు వైసిపిలో చేరారు. ఇప్పుడు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోను ఆ పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.

ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగబోదని స్పష్టమవుతోంది. పెంపుపై ఆశ పెట్టుకున్న పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

వైసిపి వైపు ఆనం బ్రదర్స్ చూపు

వైసిపి వైపు ఆనం బ్రదర్స్ చూపు

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు కూడా వైసిపి వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆనం వివేకానంద రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసింది. టిడిపిపై ఆయనఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

Recommended Video

    Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
    రంగంలోకి చంద్రబాబు

    రంగంలోకి చంద్రబాబు

    ఆనం సోదరులు అసంతృప్తితో ఉన్నారని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారని తెలుస్తోంది. వారిని బుజ్జగించేందుకు చంద్రబా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

    అందుకే అలక

    అందుకే అలక

    పార్టీలో సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని, ఇస్తామన్న ఎమ్మెల్సీ సీట్లను కూడా ఇవ్వలేదని కొంత కాలంగా ఆనం సోదరులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలోకి వస్తే కనీస మర్యాద లేకుండా పోయిందని, తమను అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టారని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని చెబుతున్నారు.

    ఏపీ టిడిపి అధ్యక్ష పదవితో కూల్

    ఏపీ టిడిపి అధ్యక్ష పదవితో కూల్

    ఆనం సోదరులను పార్టీలోనే ఉంచేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు... ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ టిడిపి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

    అధ్యక్ష పదవి కాదు.. ఎమ్మెల్సీయే కావాలి

    అధ్యక్ష పదవి కాదు.. ఎమ్మెల్సీయే కావాలి

    ప్రస్తుతం ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కింది. దీంతో కళా అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే, తమకు అధ్యక్ష పదవి వద్దని, ఎమ్మెల్సీ పదవి కావాలని ఆనం సోదరులు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయం ఆలస్యమైతే వీరు టిడిపిని వీడయం ఖాయమని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+