నా సీటుకు ఎసరు పెడుతున్నారు - ఇక నేను మాత్రం : ఆనం సంచలనం..!!
మాజీ మంత్రి..వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. నాలుగేళ్ల పాలనలో ఏం చేశామని..ఓట్లు అడుగుతామంటూ సొంత పార్టీలో కలకలానికి కారణమైన ఆనం ఇప్పుడు తన నియోజకవర్గంలో పరిస్థితుల పైర స్పందించారు. వెంకటగిరి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని..మరో ఏడాది పాటు ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పుకొచ్చారు. అప్పుడే తన సీటుకు ఎసరు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రేపు తానే ఎమ్మెల్యే అంటూ ఒక పెద్ద మనిషి చెప్పుకుంటున్నారంటూ కొత్త అంశం తెర పైకి తెచ్చారు.
నెల్లూరు వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలతో ముందుకొచ్చారు. ఈ సారి సొంత పార్టీ నేత ఆనం రాంకుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. దివంగత సీఎం నేదురుమల్లి కుమారుడు రాం కుమార్ రెడ్డి వెంకటగిరి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేదురుమల్లి, ఆనం కుటుంబాల మధ్య తొలి నుంచి గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇద్దరూ వైసీపీలోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో రాం కుమార్ రెడ్డి వెంకటగిరి సీటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ఎమ్మెల్యేనా కాదా..కొత్త వారిని ఏమైనా పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందా అని కార్యకర్తలు తనను ప్రశ్నిస్తున్నారని ఆనం వ్యాఖ్యానించారు.

తాను నియోజకవర్గంలో గడప గడకు వెళ్తే ప్రజలు ఎమ్మెల్యేకు తమ బాధలు చెప్పామనుకోవాలా, లేక ఎవరో దారిని పోయే వారికి చెప్పామని భావించాలనా అని ప్రశ్నించారు. వెంకటగిరి ప్రజలు తనను అయిదేళ్లు ఎమ్మెల్యేగా ఉండేందుకు ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తానే ఎమ్మెల్యేనని గుర్తు చేసారు. మరో ఏడాది పాటు ఎమ్మెల్యేగానే ఉంటానన్నారు. సంవత్సరం తరువాత వచ్చే పెద్దమనిషి ఇప్పుడే తాను ఎమ్మెల్యే అనే విధంగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒకసారి పోటీకి వచ్చి సగం ఎలక్షన్ లోనే పారిపోయినటువంటి వ్యక్తి అంటూ ఎద్దేవా చేసారు. ఆయన గురించి నన్ను అడిగితే ఎలా అని ప్రవ్నించారు. కొంతమంది ఆశపడుతుంటారని చెప్పుకొచ్చారు. కుర్చీ లాక్కునేద్దామా అని ఎదురుచూస్తున్నారన్నారు. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ఎసరు పెడుతున్నారంటూ ఆనం ఆగ్రహం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications