జెసి వ్యాఖ్యల్లో నిజం, టెర్రరిస్ట్ హబ్‌గా హైద్రాబాద్!: ఆనం

రాజమండ్రి/నెల్లూరు: పార్టీ అధిష్టానంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ములాకత్ అయిందన్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను కొట్టి పారేయలేమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనేది కేవలం ఊహాజనితమే అన్నారు.

తాము ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెసు పార్టీని వీడే సమస్య లేదన్నారు. విభజన జరిగితే తెలంగాణ నక్సలైట్లకు ఫ్యాక్టరీగా, హైదరాబాదు తీవ్రవాదులకు హబ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

Anam Vivekananda reddy

విభజన బాంబు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజల పైన విభజన బాంబు పెద్దదని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. వరదల కంటే ప్రజలు విభజన పైనే ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. ఇద్దరు కొడుకులను ఏ తండ్రీ, ఏ గ్రామ పెద్ద ఇంత మూర్ఖంగా విడదీయరన్నారు. టిడిపిని దెబ్బతీసేందుకే విభజన అన్నారు. ముఖ్యమంత్రి అసమర్థ సిఎం అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు వరదలతో బాదఫడుతుంటే షిండే టాస్క్ ఫోర్స్ సమావేశాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని టిడిపి 2008లో ఇచ్చిన లేఖలో పేర్కొందన్నారు. విభజనపై అఖిల పక్షాన్ని ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. మరోవైపు తాను విభజనపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు చంద్రబాబుకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+