నారా లోకేష్ అనంత పర్యటన రద్దు- సురక్షితంగా స్వస్థలాలకు తెలుగువారు: వార్ రూమ్ ఏర్పాటు

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. నేడు అక్కడ జరగాల్సిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి పాల్గొనాల్సి ఉంది. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఈ పర్యటన రద్దయింది.

దీనికి కారణం లేకపోలేదు. అల్లర్లు, దాడులతో అట్టుడికిపోతున్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకుని రావడానికి నారా లోకేష్ నడుం బిగించారు. దీనికోసం రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు నారా లోకేష్.

Anantapur Tour on Hold Minister Lokesh s Focus Shifts to Safe Return of AP Citizens from Nepal

ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేకంగా వార్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కు రావాలని ఆదేశాలు నారా లోకేష్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ను ఏర్పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.

వారి వివరాలన్నింటినీ కూడా సేకరించడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఏపీకి చెందిన ప్రతి ఒక్కరినీ వెనక్కి తీసుకుని వచ్చేంత వరకూ వార్ రూమ్ అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+