పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ సీట్ల వ్యవహారం చిక్కుగా మారుతోంది. బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో అభ్యర్దుల ఎంపిక వ్యవహారం కొత్త సందేహాలకు కారణమవుతోంది. పార్టీలో సీనియర్లు వర్సస్ వలస నేతలు అనే వివాదం కొత్తగా తెర మీదకు వస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది.
మారుతున్న లెక్కలు
కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. పార్టీ సీనియర్లు అయిన జీవీఎల్, మాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు లాంటి వారికి సీట్లు లేకపోవటం పైన ఢిల్లీ బీజేపీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇదే సమయంలో రఘురామకు సీటు ఇవ్వకపోటం వెనుక కారణాల పైన కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

కొందరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల్లో ఖరారైన కొందరి పైన పార్టీ సీనియర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీకి వచ్చిన పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ లు ఏపీలో నేతల గ్రూపులు..ఫిర్యాదులు సమస్యగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితుల పైన కేంద్ర నాయకత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
మద్దతు దొరికేనా
పురందేశ్వరి నిర్ణయాల పైన చాలా రోజలుగా పార్టీలో ప్రత్యర్ది వర్గం వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు పార్టీ నేతలు పట్టుబటి అనపర్తి స్థానం సాధించారు. అక్కడ ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్దిని ఖరారు చేసింది. దీంతో, టీడీపీ అభ్యర్దిగా ప్రచారం ప్రారంభించిన నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. టీడీపీ కేడర్ ఆయనకు మద్దతుగా నిలుస్తోంది.
అటు బీజేపీ నుంచి అభ్యర్దిగా బరిలోకి దిగుతున్న నేతకు మద్దతు ఎంత వరకు ఉంటుందనేది సందేహంగానే ఉంది. ఇదే సమయంలో అనపర్తి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఉండటంతో..పురందేశ్వరికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహం పార్టీలోని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తుది నిర్ణయం ఏంటి
రాజమండ్రి పార్లమెంట్ బరిలో వైసీపీ నుంచి బీసీ నేతను పోటీకి దించారు. కూటమి నుంచి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన బీసీ అభ్యర్ది గెలుపొందారు. ఇప్పుడు తిరిగి విజయం నమోదు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో అనపర్తి బీజేపీకి, రాజానగరం - నిడుదవోలు జనసేనకు కేటాయించారు.
తాజాగా బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ సీట్ల నుంచి పురందేశ్వరి మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. దీంతో, పురందేశ్వరి విజయం కోసం చంద్రబాబు ఏ మేర చొరవ తీసుకుంటారు...అనపర్తిలో పరిస్థితి ఎలా సర్దుబాటు చేస్తారనేది మూడు పార్టీల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications