Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయలసీమ హాట్ సీట్‌‌లో ఇద్దరు మహిళల మధ్య పోటీ: టీడీపీకి అదే మైనస్

AP Assembly election 2024: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం లోక్‌సభ పరిధిలోని వచ్చే పెనుకొండ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం బలంగా ఉన్న ఈ స్థానంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఎదురుగాలి వీస్తోంది.

ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఇది. పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం మండలాలు.. దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా దళితుల ఓటుబ్యాంకు అధికం. ఆ తరువాత రెడ్డి, బీసీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. 2.20 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారిక్కడ.

Andhra Assembly elections 2024: Is TDP gets another set back in Penukonda?

ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. నిజానికి- ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ప్రత్యేకించి- పరిటాల కుటుంబం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది.

జనరల్ సీటుగా ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర మూడు సార్లు ఇక్కడ విజయం సాధించారు. 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారిన తరువాత కూడా రెండుసార్లు టీడీపీ జయకేతనం ఎగురవేసింది. బీకే పార్థసారథి వరుసగా రెండుసార్లు గెలిచారు. 2019లో శంకరనారాయణ చేతిలో మట్టికరిచారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు ఆ పార్టీదే హవా సాగిందంటే.. ఇక్కడ టీడీపీ ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. 1989, 1991 ఉప ఎన్నికలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత టీడీపీ ఆధిపత్యం 2019 వరకూ కొనసాగింది.

1994, 1999, 2004 ఎన్నికల్లో పరిటాల రవీంద్ర గెలిచారు. 2009, 2019లో బీకే పార్థసారథి విజయం సాధించారు. 1994 తరువాత తొలిసారిగా టీడీపీ ఓడిపోయింది 2019లోనే. బీకే పార్థసారథిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంకరనారాయణ 15 వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఘన విజయం సాధించారు.

Andhra Assembly elections 2024: Is TDP gets another set back in Penukonda?

2024 ఎన్నికల కోసం అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ.. అభ్యర్థులను మార్చాయి. మహిళలను రంగంలోకి దించాయి. వైఎస్ఆర్సీపీ తరఫున మంత్రి ఉష శ్రీచరణ్ పోటీలో దిగారు. టీడీపీ అభ్యర్థిగా స్థానిక నాయకురాలు సవిత బరిలోకి దిగారు. ఇది- రాజకీయ స్వరూపాన్నే మార్చివేసింది. ఇద్దరు మహిళలు పోటీ పడటం ఇదే తొలిసారి.

Andhra Assembly elections 2024: Is TDP gets another set back in Penukonda?

2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల భానుమతి పోటీ చేశారు గానీ.. పరిటాల రవీంద్ర చేతిలో పరాజయాన్ని చవి చూశారు. బీకే పార్థసారథికి ఇప్పుడు టికెట్ లభించకపోవడం.. టీడీపీకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. బీకే మద్దతుదారులు పెద్ద ఎత్తున టీడీపీకి రాజీనామాలు చేస్తోన్నారు. సవితకు మద్దతు ఇవ్వట్లేదంటూ తీర్మానించారు. అదే సమయంలో ఉష శ్రీచరణ్ రోజురోజుకూ బలపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+