ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుదో తేల్చేసిన జాతీయ సర్వే కొత్త రిపోర్ట్
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది.

నేడు 12 రోజున బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ- విరామం ప్రకటించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఇదే క్యాంప్ నుంచి బుధవారం ఉదయం 10 గంటలకు యధాతథంగా బస్సు యాత్ర మొదలవుతుంది.
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా గళం పేరుతో ప్రచార సభల్లో పాల్గొంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. రోడ్ షోలతో జనంలోకి దూసుకెళ్తోన్నారు.
పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం, నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఇప్పటికే పవన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో అడుగు పెట్టాల్సి ఉన్నప్పటికీ.. జ్వరం కారణంగా విరామం ఇచ్చారు.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా- జన్‌మత్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీకి 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి.. 46 నుంచి 48 స్థానాలకు పరిమితమౌతుందని జన్‌మత్ పేర్కొంది.
Andhra pradesh assembly election 2024
— Janmat polls (@Janmatpolls) April 9, 2024
(175 seats )
Ground report today
YSRCP=120-123
TDP alliance =46-48#AndhraPradeshElection2024
కిందటి నెల విడుదల చేసిన సర్వే నివేదికలో- ఇదే సంస్థ వైసీపీకి 114 నుంచి 117 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ఇప్పుడు ఈ సంఖ్యను పెంచింది జన్‌మత్ సంస్థ. 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారాయనే విషయాన్ని ఈ సంస్థ చెప్పకనే చెప్పినట్టయింది.












Click it and Unblock the Notifications