ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం: జాప్యం చేయకుండా మూడు రాజధానుల బిల్లు..!!

అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశ పర్చాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ తరువాత ఏ రోజైనా అసెంబ్లీ భేటీ అవ్వొచ్చని సమాచారం. ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేలా అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తుంది.

Recommended Video

    జాప్యం చేయకుండా మూడు రాజధానులు బిల్లు *AP Politics | Telugu OneIndia

    అంతకంటే ముందు- ఏపీ మంత్రివర్గం సమావేశమౌతుంది. ఈ నెల 7వ తేదీన వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం షెడ్యూల్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ భేటీలో ఖారరవుతుంది. దీనితోపాటు- సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై ఇందులో చర్చిస్తారు. ప్రత్యేకించి- మూడు రాజధానుల బిల్లు విషయంలో ఇక జాప్యం చెయ్యకూడదని, ఈ భేటీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

    Andhra Assembly monsoon session likely to start in September 20: Reports

    నిజానికి- ఏపీ మంత్రివర్గం కిందటి నెల 29వ తేదీ నాడే సమావేశం కావాల్సి ఉంది. అది ఇవ్వాళ్టికి వాయిదా పడింది. వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రెండోసారి కూడా ఈ భేటీని వాయిదా వేశారు. సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించాల్సి ఉన్నందున- ఈ నిర్ణయం తీసుకున్నారు.

    7వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ భేటీలో వర్షాకాల సమావేశాల తేదీని ఖరారు చేస్తారు. ఈ నెల 20వ తేదీ తరువాత నిర్వహించేలా ప్రాథమిక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇదివరకు మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మరింత మెరుగైన బిల్లుతో వస్తామంటూ వైఎస్ జగన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తరువాత ఇప్పటివరకు అది చర్చకు రాలేదు.

    కాగా- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణను ఈ వర్షాకాల సమావేశాల కోసం కూడా కొనసాగిస్తారా? లేక సభకు హాజరవుతారా? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సభకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+