నిమ్మగడ్డకు కీలక బాధ్యతలు - చిన్నికి ఏసీఏ పగ్గాలు..!!

ఏపీ ప్రభుత్వం ఏసీఏ ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షుడు సహా ఇతరులు రాజీనామా అనివార్యమైంది. విజయవాడలో ఆంధ్ర క్రికెట్‌ అసోయేషన్‌ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది. మరో నెలలో ఏసీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక అధికారిగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారు. ఏసీఏ కొత్త అధ్యక్షుడి గా విజయవాడ ఎంపీ కేశినేని ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

ఏసీఏలో సమూల మార్పులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీ విజయసాయిరెడ్డి టీం పూర్తిగా ఏసీఏను తమ అధీనంలోకి తీసుకుంది. 2022 నుంచి 2025 వరకు అపెక్స్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్న వారంతా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు పీ. శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పీ. రోహిత్‌రెడ్డి, కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపీనాథ్‌రెడ్డి సహా ఇతరులు చేసిన రాజీనామాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. కొత్త అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా. ఎన్నిక నిర్వహణకు తేదీని సర్వసభ్య సమావేశం ఖరారు చేసింది.

Andhra Cricekt Association Apex Council Resingation Accepts new committe to elect

నిమ్మగడ్డకు బాధ్యతలు
సెప్టెంబరు 8వ తేదీన సీనియర్‌ విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిశీలకునిగా ఎన్నిక జరగనుంది. అంతవరకు ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఇందులో మాజీ మంత్రి కె. రంగారావుతోపాటు, మురళీమోహన్‌ సభ్యులు వ్యవహరిస్తారని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌లో క్రికెట్‌ స్టేడియాల పరిస్థితిపై, క్రికెటర్లకు అందుతున్న సౌకర్యాలపై చర్చించారు. ఈ అంశాలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఎంపీ చిన్ని వివరించారు.

Andhra Cricekt Association Apex Council Resingation Accepts new committe to elect

కొత్త అధ్యక్షుడిగా చిన్ని
వచ్చే నెల 8న గుంటూరులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ చిన్ని అధ్యక్షుడిగా పోటీ చేయనున్నారు. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్ లు ఆయన అభ్యర్దిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అరిందో డైరెక్టర్, విజయ సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. 33 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశానికి విష్ణుకుమార్ రాజు ఛైర్మన్ గా వ్యవహరించారు. విష్యత్ లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+